పాన్ ఇండియన్ సినిమా అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ప్రతీ ఇండస్ట్రీ లోను చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరు పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తున్నారు. ఒక రెండు మూడు హిందీ సినిమాలు చేసి, నా ముందు తరం స్టార్ హీరోలు కూడా సాధించలేని అరుదైన ఘనత సాధించాము అని అనుకునే హీరోలు కూడా ఉన్నారు. కానీ ఆరోజుల్లోనే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున వంటి వారు పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు ని దక్కించుకొని బాలీవుడ్ లో సినిమాలు చేసాడు.
అలా చిరంజీవి (Chiranjeevi) అప్పట్లో ‘ఆజ్ కా గూండా రాజ్’, ‘ప్రతిబంద్’ మరియు ‘ది జెంటిల్ మెన్’ వంటి సినిమాలు చేసాడు. తెలుగు లో సూపర్ హిట్ గా నిల్చిన ‘గ్యాంగ్ లీడర్’ కి రీమేక్ ‘ఆజ్ కా గూండా రాజ్’, అలాగే రాజశేఖర్ హీరో గా నటించిన ‘అంకుశం’ సినిమాకి రీమేక్ ‘ప్రతిబంద్’. ఈ రెండు చిత్రాలు కూడా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపాయి.
ఇక ఆ తర్వాత సౌత్ లో శంకర్ మరియు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘జెంటిల్ మెన్’ అనే చిత్రం అప్పట్లో పెద్ద సెన్సేషనల్ హిట్. ఈ చిత్రాన్ని హిందీ లో చిరంజీవి రీమేక్ చేసాడు. ఈ చిత్రం బాలీవుడ్ లో పెద్దగా ఆడలేదు. ఈ సినిమాకి ప్రముఖ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మహేష్ భట్ దర్శకత్వం వహించాడు. మహేష్ భట్ మరెవరో కాదు, ప్రముఖ స్టార్ హీరోయిన్ ‘అలియా భట్’ కి తండ్రి అవుతాడు.
ఇక బాలీవుడ్ ని అప్పట్లో ఒక ఊపు ఊపేస్తున్న హీరోయిన్స్ లో ఒకరు జూహీ చావ్లా ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. అప్పట్లో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ పరంగా నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది సమాచారం, మెగాస్టార్ రేంజ్ కి ఇది చాలా తక్కువ అనే చెప్పాలి.
స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!
చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !