‘వీరభద్ర’ టు ‘ఆచార్య’.. ఈ రిలీజ్ డేట్ కూడా దడపుట్టించింది కదా…!

సినీ పరిశ్రమలో సెంటిమెంట్లు ఎక్కువే. ఈ విషయం కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. సినిమా పూజా కార్యక్రమాల్లో భాగంగా కొబ్బరి కాయ కొట్టినప్పటి నుండి గుమ్మడికాయ కొట్టే వరకు ఫిలిం మేకర్స్ చాలా సెంటిమెంట్లు ఫాలో అవుతూ ఉంటారు. అన్నిటికీ మించి రిలీజ్ డేట్ విషయంలో..! అవును మంచి రిలీజ్ డేట్ దొరికితే కచ్చితంగా సినిమా థియేట్రికల్ రన్ కి హెల్ప్ అవుతుంది అనేది అందరి నమ్మకం. జనవరి 14, మార్చి 30, ఏప్రిల్ 28, మే 9, సెప్టెంబర్ 28 వంటి రిలీజ్ డేట్లు ఇండస్ట్రీకి చాలా బాగా కలిసొచ్చాయి అనేది జనాల నమ్మకం.

Veerabhadra, Acharya

ఈ డేట్లకి రిలీజ్ అయిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. జనవరి 14 సంక్రాంతి పండుగ సెలవు ఉంటుంది కాబట్టి ఈ డేట్ మంచిదని చాలా మంది భావిస్తారు. అలాగే ఏప్రిల్ 28న ‘అడవి రాముడు’ ‘పోకిరి’ (Pokiri) ‘బాహుబలి 2’ (Baahubali 2) వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలు కూడా వచ్చాయి. ఇక మే 9కి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) ‘గ్యాంగ్ లీడర్’ (Gang Leader) ‘మహానటి’ (Mahanati) ‘మహర్షి’ (Maharshi) వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.

అలాగే ఇండస్ట్రీకి కలిసి రాని రిలీజ్ డేట్లు కూడా ఉన్నాయి. అందులో ఒకటి జనవరి 10. ఈ డేట్ కి రిలీజ్ అయిన ‘1 నేనొక్కడినే’ (1: Nenokkadine) ‘అజ్ఞాతవాసి’ (Agnyaathavaasi) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) వంటి సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. అలాగే ఏప్రిల్ 29 కూడా బ్యాడ్ రిలీజ్ డేట్ అని కొందరు భావిస్తున్నారు. 19 ఏళ్ళ క్రితం ఇదే డేట్ కి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘వీరభద్ర’ (Veerabhadra) సినిమా వచ్చింది.

అది ఫ్లాప్ అయ్యింది. అలాగే 14 ఏళ్ళ క్రితం రానా (Rana Daggubati) – పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్లో తెరకెక్కిన ‘నేను నా రాక్షసి’ (Nenu Naa Rakshasi) కూడా ఏప్రిల్ 29న రిలీజ్ అయ్యింది. అది కూడా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఇక 3 ఏళ్ళ క్రితం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) -చరణ్ (Ram Charan) కాంబినేషన్లో వచ్చిన ‘ఆచార్య’ (Acharya) కూడా పెద్ద డిజాస్టర్ అయ్యింది.

ఆ 2 డైలాగులపై సీరియస్ అవుతున్న మంచి విష్ణు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus