పెళ్ళి ప్రపోజల్ తో ప్రియురాలికి షాక్ ఇచ్చిన దర్శకుడు.. వీడియో వైరల్!

హీరోయిన్ ని హీరో ప్రేమించాలి అంటే… సినిమాల్లో రకరకాలుగా చూపిస్తూ ఉంటారు. పెద్ద సినిమాల్లో అయితే హీరో పెద్ద ఫైట్ చేసినప్పుడు హీరోయిన్ ఇంప్రెస్ అయిపోయినట్టు చూపిస్తారు. కొన్నాళ్ల తర్వాత హీరోయిన్ ని రౌడీలు చుట్టుముట్టిన టైంలో హీరో వచ్చి సేవ్ చేయడం.. ఆ తర్వాత ఆమె హీరోతో ప్రేమలో పడటాన్ని చూపించారు. ఇంకా కొన్ని సినిమాల్లో హీరోయిన్ కి వచ్చే సమస్యని హీరో సాల్వ్ చేయడానికి చేసే ఫైట్ ను ‘ఒక్కడు’ (Okkadu) ‘భద్ర’ (Bhadra) వంటి సినిమాల్లో చూపించారు.

Abishan

ఇక అటు తర్వాత హీరో సినిమాలో ‘రాముడు మంచి బాలుడు’ పదిమందికి అండగా నిలబడతాడు అనే కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు హీరోయిన్లు ఇంప్రెస్ అయ్యి ప్రేమలో పడినట్లు చూపించారు. సినిమాల్లో ఇవే వర్కౌట్ అయ్యాయి. కానీ ప్రేమ కోసం, ప్రియురాలి కోసం కెరీర్లో చాలా కష్టపడి సెటిల్ అయిన ప్రపోజల్స్ ‘మనసిచ్చి చూడు’ వంటి అతి తక్కువ సినిమాల్లో మాత్రమే వచ్చాయి. ఇలాంటి వాటిని యూత్ ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుంది.

బహుశా ఓ దర్శకుడు ఆ సినిమాని చూసే ఇన్స్పైర్ అయినట్లు ఉన్నాడు. తాను సక్సెస్ అయ్యాక స్టేజిపై తన ప్రియురాలికి ప్రపోజ్ చేసి వార్తల్లో నిలిచాడు. అతను మరెవరో కాదు తమిళ ద‌ర్శ‌కుడు అభిషన్ జీవంత్. ఇతను డైరెక్ట్ చేసిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ అనే సినిమా త్వరలో రిలీజ్ కానుంది. దీని ప్రీరిలీజ్ ఈవెంట్‌లో భాగంగా డైరెక్ట‌ర్ అభిష‌న్ తన ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు. ‘నిన్ను చిన్నప్పటి నుండి ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం.

నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. పెళ్ళయ్యాక బాగా చూసుకుంటాను” అంటూ అందరి ముందు ప్రపోజ్ చేయగా.. అందుకు అతని ప్రియురాలు అఖిల.. కన్నీళ్లు పెట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

నాగవంశీ సినిమాలు.. అనౌన్స్‌మెంట్లలో కామన్‌ పాయింట్ చూశారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus