Srinidhi Shetty: రెండో ‘కేజీయఫ్‌’లో చనిపోయిందిగా.. మళ్లీ ఎలా? ఎందుకు?

‘కేజీయఫ్‌ 3’ ఎప్పుడు స్టార్ట్‌ అవుతుంది? ఈ ప్రశ్న చాలా నెలల నుండి వినిపిస్తూనే ఉంది. దీనికి సమాధానం కూడా సరిగ్గా రావడం లేదు. దీనికి కారణం ‘కేజీయఫ్‌ 2’  (KGF 2)లో కథను పూర్తి చేయలేదు. మరోవైపు ఆ సినిమా ఫ్రాంచైజీ నుండి ఎన్ని సినిమాలు వచ్చినా విజయం సాధించడం పక్కా అనే వైబ్‌. అయితే రెండో ‘కేజీయఫ్‌’ (KGF)  సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీనిధి శెట్టికి (Srinidhi Shetty)  మరో రకమైన ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె క్లారిటీగా ఆన్సర్‌ కూడా చేసింది. అయితే ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది అనేదే ఇక్కడ డౌట్.

Srinidhi Shetty

‘కేజీయఫ్‌ 3’లో మీ పాత్ర మళ్లీ వస్తుంది అని అంటున్నారు. నిజమేనా అని శ్రీనిధి శెట్టి దగ్గర ప్రస్తావిస్తే దీని గురించి దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ని (Prashanth Neel) నేనూ అడుగుతూనే ఉన్నానని ఆమె చెప్పుకొచ్చింది. కొన్ని రోజుల క్రితం ముంబయిలో ఓ సినిమా షూటింగ్‌ సందర్భంగా యశ్‌ను (Yash) కలిసినప్పుడు కూడా ఈ విషయం గురించి మాట్లాడాం అని కూడా చెప్పింది శ్రీనిధి. ‘కేజీయఫ్‌ 2’ సినిమాలో నా పాత్రని చంపేశారు కదా. నెక్స్ట్‌ ఏంటి అని అడిగా అని చెప్పింది.

మరి మీ డిస్కషన్‌లో ఫైనల్‌గా ఏం తేలింది అని అడిగితే.. ఏమో మూడో ‘కేజీయఫ్‌’ సినిమాలో నేను ఉన్నానా? లేదా? అన్నది తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఎదురు చూడాల్సిందే అని చెప్పింది. అంటే ఆమె పాత్రను తిరిగి తీసుకురావాలనే ఆలోచన ‘కేజీయఫ్‌ 2’ సమయంలో జరిగి ఉండాలి. మరి అప్పుడు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఏదో ఆలోచన చేసే ఉంటారు. అయితే సినిమా స్టార్ట్‌ అయినప్పుడు క్లారిటీ ఇస్తారు.

ఎందుకంటే ‘కేజీయఫ్‌ 2’లో రాకీ భాయ్‌ (యశ్‌) పాత్ర సముద్రంలో పడిపోయినట్లు చూపిస్తారు తప్ప.. చనిపోయినట్లు చెప్పరు. కాబట్టి ఆ పాత్ర బతికే అవకాశం ఉంది. అలా రీనా (శ్రీనిధి శెట్టి)ని కూడా తిరిగి ఏదో రూపంలో తెస్తారు అనేది ఓ చర్చ.

వెంకటేష్ ‘ఆడవారి మాటలకు..’ కి 18 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus