Samyuktha Menon: సంయుక్త మీనన్ కు వెరైటీ కష్టాలు.. ఆ స్టేటస్ దక్కుతుందా?

  • April 24, 2023 / 05:01 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న హీరోయిన్లలో సంయుక్త మీనన్ ఒకరనే సంగతి తెలిసిందే. వరుస విజయాలు సంయుక్త మీనన్ జాతకాన్ని మార్చేశాయి. ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. మిడిల్ రేంజ్ హీరోలు సంయుక్త మీనన్ కు వరుసగా ఆఫర్లు ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ బ్యూటీకి కెరీర్ పరంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఒకటి రెండు సినిమాలతో సక్సెస్ సాధించిన హీరోయిన్లకు కోట్ల రూపాయల స్థాయిలో రెమ్యునరేషన్ దక్కుతుండగా సంయుక్త మీనన్ కు మాత్రం ఆ స్థాయిలో రెమ్యునరేషన్ దక్కడం లేదని తెలుస్తోంది.

తెలుగులో నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ఉన్న ఈ హీరోయిన్ ను అటు స్టార్ హీరోలు, ఇటు స్టార్ డైరెక్టర్లు పట్టించుకోకపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. సంయుక్త మీనన్ ప్రస్తుతం డెవిల్ సినిమాలో నటిస్తుండగా ఆమె తర్వాత ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత రావడం లేదు. గ్లామర్ రోల్స్ లో ఎక్కువగా కనిపించకపోవడం వల్లే ఆమెకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు అయితే రావడం లేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

గోల్డెన్ లెగ్ ఇమేజ్ ఉన్న బ్యూటీ ఇలాంటి వింత పరిస్థితిని ఎదుర్కోవడం సంయుక్త మీనన్ విషయంలోనే జరిగిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బ్యూటీ టైమ్ అస్సలు పాటించడం లేదని అందువల్లే కొందరు దర్శకనిర్మాతలు సంయుక్త మీనన్ కు ఛాన్స్ ఇవ్వాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

(Samyuktha Menon) సంయుక్త మీనన్ టాలెంట్, సక్సెస్ రేట్ కు ఆమె మరో రేంజ్ లో ఉండాలని అయితే పరిస్థితులు మాత్రం అనుకూలించడం లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కామెంట్ల గురించి సంయుక్త ఏ విధంగా రియాక్ట్ అవుతారో తెలియాల్సి ఉంది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus