యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ మూవీకి సంబంధించి వస్తున్న ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 31వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. కొన్నిరోజుల క్రితం మాంటేజ్ షాట్స్ ను తీసిన కొరటాల శివ 31వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో యాక్షన్ సన్నివేశాలను షూట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ లో ఫారిన్ విలన్స్ పాల్గొంటారని హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం పని చేస్తున్నారని తెలుస్తోంది.
కార్గో షిప్ పై ఈ యాక్షన్ సీక్వెన్స్ షూట్ జరగనుందని సమాచారం అందుతోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ ను పూర్తి చేసి తారక్, ఇతర నటీనటుల కాంబో సన్నివేశాలను మొదలుపెట్టనున్నారని బోగట్టా. ఈ సినిమా కోసం డబ్బులు మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుండగా పది భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఇకపై వరుస షూటింగ్ లతో బిజీ కావాలని తారక్ భావిస్తున్నారు.
సరికొత్త లుక్ లో తారక్ ఈ సినిమాలో నటిస్తుండగా మే నెల 20వ తేదీన ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్ డేట్ రానుందని తెలుస్తోంది. వైజాగ్, గోవాలో మెజారిటీ సీన్ల షూట్ జరగనుందని సమాచారం అందుతోంది. అతి త్వరలో జాన్వీ కపూర్ కూడా ఈ సినిమా షూట్ లో పాల్గొననున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సాబు సిరిల్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
టాప్ టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పని చేస్తుండగా అనిరుధ్ ఈ సినిమా (NTR30) కొరకు అదిరిపోయే ట్యూన్లు సిద్ధం చేశారని బోగట్టా. అనిరుధ్ రూపంలో థమన్, దేవిశ్రీ ప్రసాద్ లకు గట్టి పోటీ మొదలైనట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.