Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఇవి రెండూ పాన్ ఇండియా ప్రాజెక్టులే. ఈ సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయో, ఎప్పుడు రిలీజ్ అవుతాయో అంచనా వేయడం కష్టం. అయినప్పటికీ, అల్లు అర్జున్ వీలు కుదిరినప్పుడల్లా కొత్త కథలు వింటున్నాడు. అందులో భాగంగానే ‘మిన్నల్ మురళి’ దర్శకుడు బాసిల్ జోసెఫ్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.

Allu Arjun

ప్రస్తుతం బాసిల్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో పడ్డాడు. ఈ సినిమాను ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో దర్శకుడికి కూడా అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. విషయంలోకి వెళితే.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేసేందుకు అల్లు అర్జున్ రెడీ అయ్యాడట. గతంలో వీరి కాంబోలో ‘సరైనోడు’ అనే బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది.

మాస్ ఆడియన్స్‌లో అల్లు అర్జున్ క్రేజ్‌ను మరింత పెంచిన సినిమా ఇది. ఆ సినిమా టైంలోనే ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్‌లో మరో సినిమా చేయడానికి బోయపాటి శ్రీను అడ్వాన్స్ తీసుకున్నాడు. అప్పట్లో చిరంజీవితో.. బోయపాటి సినిమా ఉంటుందనే ప్రచారం కూడా జరిగింది. కానీ, ఎందుకో ఆ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదు. మొత్తానికి ఇప్పుడు మళ్లీ అల్లు అర్జున్‌తోనే సినిమా చేయడానికి బోయపాటి శ్రీను ముందుకొచ్చారు.

కాకపోతే ఈసారి వీరిద్దరి కాంబోలో రాబోయేది మాస్ సినిమా కాదట.. మైథలాజికల్ సబ్జెక్ట్ అట! అవును, బోయపాటి శ్రీను అల్లు అర్జున్‌కు ఓ దేవుడి కథ చెప్పి ఓకే చేయించుకున్నారట. ప్రస్తుతం మైథలాజికల్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. పాన్ ఇండియా లెవెల్‌లో వీటికి భారీ క్రేజ్ ఉంది. అందుకే బోయపాటి కథను బన్నీ ఫైనల్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు.

‘ఈ ఎన్ ఈ రిపీట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus