Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఆటగాళ్లు

ఆటగాళ్లు

  • August 24, 2018 / 10:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆటగాళ్లు

కెరీర్ కొత్తలో కమర్షియల్ అంశాలకు దూరంగా అర్ధవంతమైన చిత్రాలు చేసిన నారా రోహిత్ అనంతరం కమర్షియల్ హీరో మార్క్ కోసం చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. ఆ కోవలో వచ్చిన మరో చిత్రమే “ఆటగాళ్లు”. “ఆంధ్రుడు” ఫేమ్ పరుచూరి మురళి తెరకెక్కించిన ఈ చిత్రంలో జగపతిబాబు కీలకపాత్ర పోషించారు. ఏడాది నుంచి విడుదలవ్వడానికి నానా ఇబ్బందులుపడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఇవాళ విడుదలైంది. మరి ఈ ఆటగాళ్ల ఆట ప్రేక్షకుల్ని రంజింపజేసిందో లేదో చూద్దాం..!!aatagallu-1

కథ : ప్రముఖ తెలుగు దర్శకుడు సిద్ధార్ధ్ (నారా రోహిత్) తన భార్యను హత్య చేసిన కేసులో ఇరుక్కుంటాడు. ఆ హత్య తాను చేయలేదని సిద్ధార్ధ్ చెబుతున్నప్పటికీ సాక్ష్యాలన్నీ అతడికి విరుద్ధంగా ఉండడంతో అందరూ సిద్ధార్దే ఈ హత్య చేశాడని విశ్వసిస్తుంటారు. అప్పుడు ఈ కేస్ ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వాదించడానికి వచ్చిన ఫేమస్ క్రిమినల్ లాయర్ వీరేంద్ర (జగపతిబాబు)కు ఈ కేస్ లో సిద్ధార్డ్ తప్పులేదని తన ఇన్వెస్టిగేషన్ ద్వారా ప్రూవ్ చేసి సిద్ధార్ధ్ ను శిక్ష నుంచి తప్పిస్తాడు.

అయితే.. అంజలి (దర్శనీ బానిక్) హత్య కేసులో ప్రపంచానికి తెలియని సీక్రెట్ ఏదో ఉందని గ్రహిస్తాడు వీరేంద్ర. రీ-ఇన్వెస్టిగేట్ చేయగా ఈ హత్య కేసులో చాలా మంది హస్తం ఉండడంతోపాటు.. దారుణమైన నిజాలు కూడా కప్పబడ్డాయని తెలుసుకొంటాడు వీరేంద్ర. ఏమిటా నిజాలు? ఇంతకీ అంజలిని చంపింది ఎవరు? అందుకు కారణం ఏమిటి? అనేది “ఆటగాళ్లు” కథాంశం.aatagallu-2

నటీనటుల పనితీరు : అది సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ అని ఫిక్స్ అయిపోయాడో లేక ఈ సినిమాకి అంతకంటే ఎక్కువగా కష్టపడి హావభావాలు ప్రదర్శించాల్సిన అవసరం లేదని ఫిక్స్ అయ్యాడో తెలియదు కానీ.. ముఖంలో ఒక్క ఎక్స్ ప్రెషన్ కూడా కనబడనివ్వకుండా బ్లాంక్ ఫేస్ & ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. ఎమోషనల్ అవుతున్నాడో లేక కోప్పడుతున్నాడో అర్ధం కాక ఇబ్బందిపడుతుంటారు జనాలు.

జగపతిబాబు మాత్రం తన పాత్రకు న్యాయం చేశాడు. కాకపోతే.. ఆయన క్యారెక్టర్ కు ఉన్నంత వెయిట్ డీలింగ్ లో లేకపోవడంతో ఢీలాపడతారు ప్రేక్షకులు. బ్రహ్మానందం చేత చేయించింది కామెడీ అని దర్శకుడు ఫిక్స్ అయ్యాడు కానీ.. ప్రేక్షకుల్ని మాత్రం నవ్వించలేకపోయాడు. అజయ్, దర్శనీ బానిక్, తులసి తదితరులు తమ తమ పాత్రలు న్యాయం చేయడానికి ప్రయత్నించారు.aatagallu-3

సాంకేతికవర్గం పనితీరు : సాయికార్తీక్ దగ్గర సినిమా మరీ ఎక్కువ రోజులు ఉండిపోవడం వలన డెసిబల్స్ మరీ ఎక్కువగా ఇచ్చాడు. ఇక సినిమా మొత్తంలో ఆ “బిగ్ బాస్” షో థీమ్ మ్యూజిక్ వినబడుతున్నప్పుడు సాయికార్తీక్ ఆ షో మ్యూజిక్ కాపీ కొట్టాడా లేక ఆ షోకి కూడా సాయికార్తీక్ సంగీతం అందించాడా అనే విషయం మాత్రం అర్ధం కాదు. ఆయన ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ చేయడం విశేషం. విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీలో కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉన్నాయి.

“ఆంధ్రుడు” సినిమా చూస్తున్నంతసేపూ “అబ్బా ఏం తీశాడ్రా సినిమా” అనే భావన ప్రేక్షకులకు ప్రతి ఫ్రేమ్ లో కలుగుతుంది. అలాంటి దర్శకుడి నుంచి వస్తున్న సినిమా కావడంతో కనీస స్థాయిలో ఎమోషన్స్ లేదా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని ఎక్స్ పెక్ట్ చేసిన ఆడియన్స్ ఆశల్ని తుంగలో తొక్కి పడేశాడు దర్శకుడు పరుచూరి మురళి. సినిమా మొత్తంలో ఆకట్టుకొనే అంశం ఒక్కటి కూడా లేదే. అప్పుడెప్పుడో హిందీలో అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలో రూపొందిన ఓ క్రైమ్ థ్రిల్లర్ ను బేస్ చేసుకొని ఇప్పుడు “ఆటగాళ్లు” సినిమా తెరకెక్కించడం అనేది హాస్యాస్పదం. ఒక ఫిలిమ్ మేకర్ గా పరుచూరి మురళి మీద కొందరు ఫిలిమ్ లవర్స్ ఉన్న రెస్పెక్ట్ కూడా ఈ సినిమాతో పోతుంది.aatagallu-4

విశ్లేషణ : ఈ పస లేని క్రైమ్ థ్రిల్లర్ ను చూడడం కంటే అమేజాన్, నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న వెబ్ సిరీస్ లు చూడడం చాలా బెటర్.aatagallu-5

రేటింగ్ : 1/5

Click Here To Read In ENGLISH

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aatagallu Movie Review
  • #Aatagallu Movie Review. Aatagallu Telugu Review
  • #Darshana Banik
  • #Jagapati Babu
  • #Movie Review

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

5 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

1 day ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

9 mins ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

1 hour ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 hours ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 hours ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version