ఐశ్వర్యరాయ్-అభిషేక్ లకు వివాహం జరగాడానికి మునుపు ఐశ్వర్యకు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కు నడుమ నడిచిన ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఐశ్వర్య పెళ్ళికి ముందు అభిషేక్-వివేక్ లు కలిసి నటించిన ఆఖరి చిత్రం “యువ”. ఆ తర్వాత ఈ ఇద్దరు కలిసి నటించడం కాదు కదా.. కనీసం ఒకరినొకరు కలుసుకొన్న దాఖలాలు సైతం లేవు.
దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ రాంగోపాల్ వర్మ పుణ్యమా అని ఈ ఇద్దరు కలిసి నటించనున్నారు.
2002లో రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన “కంపెనీ” చిత్రానికి సీక్వెల్ గా రూపొందనున్న “గవర్నమెంట్” చిత్రంలో మళ్లీ అభిషేక్-వివేక్ కలిసి నటించనున్నారని సమాచారం. వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అభిషేక్ ముఖ్యపాత్ర పోషించనున్నాడు.
ఈ విధంగా.. ఐశ్వర్య మాజీ ప్రియుడి నిర్మాణ సారధ్యంలో ఆమె భర్త నటిస్తుండడం పట్ల బాలీవుడ్ జనాలు రకరకాలుగా మాట్లాడుకొంటున్నారు!