Abhishek Bachchan, John Abraham: జాన్ అబ్రహంకు షాకిచ్చిన అభిషేక్ బచ్చన్!

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుం కోశియుమ్’ సినిమాను వివిధ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రీమేక్ కి సంబంధించిన అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. తెలుగులో పవన్ కళ్యాణ్-రానా ల కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ సినిమాను తమిలలో కూడా రీమేక్ చేయనున్నారు. అయితే మలయాళ వెర్షన్ ను చాలా మంది చూసేశారు. అమెజాన్ లో ఈ సినిమా రికార్డ్ స్థాయి వ్యూస్ ను పొందింది.

తెలుగు వాళ్లు, తమిళులు, కన్నడిగులు ఈ సినిమాను తెగ చూశారు. అందుకేనేమో తమిళ రీమేక్ ఊసే లేదు. మొదట్లో శరత్ కుమార్ – శశి కుమార్ అంటూ వార్తలు వచ్చినా.. ఆ తరువాత కార్తీ – పార్తిబన్ లు తెరపైకి వచ్చారు. రీమేక్ రైట్స్ అయితే ఓ సంస్థ కొనుగోలు చేసిందనే వార్తలు వచ్చాయి కానీ.. ఇన్నాళ్లపాటు ఆ సినిమాలో ఎవరు నటిస్తారనే విషయంలో క్లారిటీ రాలేదు. ఇక ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను నటుడు జాన్ అబ్రహం కొనుగోలు చేశాడు.

తనొక పాత్రలో నటించే ఉద్దేశంతో జాన్ ఈ సినిమాను ఎన్నుకున్నట్లుగా ఉన్నారు. రెండో పాత్రకు అభిషేక్ బచ్చన్ ను ఎంచుకున్నాడు. దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా చేశారు. అయితే ఇప్పుడు అభిషేక్ ఆ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జాన్ మరొక హీరోని వెతికి పట్టుకొనే పనిలో పడ్డారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus