RRR, KGF2: ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 ఫలితాలు అదే ప్రూవ్ చేశాయా?

ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన సినిమాలలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాలు ముందువరసలో ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా అంచనాలకు మించి విజయం సాధించడంతో పాటు 1,000 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. కేజీఎఫ్2 సినిమాకు దాదాపుగా 350 కోట్ల రూపాయల బిజినెస్ జరగగా ఈ సినిమా కూడా ఫుల్ రన్ లో 1,000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి.

Click Here To Watch NOW

అయితే ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాలలో మరీ గొప్ప కథ, కథనం అయితే లేవని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలలో కథ కంటే యాక్షన్ సన్నివేశాలే హైలెట్ గా నిలిచాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ లో ఇంటర్వెల్ ఫైట్ సీన్, క్లైమాక్స్ ఫైట్ సీన్ కీలక పాత్ర పోషించాయి. కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాలో కూడా యశ్ ఎలివేషన్ సీన్లు సినిమాకు హైలెట్ గా నిలిచాయి.

ఫస్టాఫ్ సోసోగా ఉన్నా సెకండాఫ్ లో ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి సర్ప్రైజ్ చేస్తూ ప్రశాంత్ నీల్ ప్రేక్షకులను ఆశ్చర్యపోయేలా చేశారు. నార్త్ ఇండియాలో సాహో సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడనికి ఆ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలే కీలకంగా మారాయనే సంగతి తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో యాక్షన్ సినిమాలే నిర్మాతలకు లాభాలను అందిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాల సక్సెస్ ప్రభావం తర్వాత విడుదలయ్యే సినిమాలపై కూడా పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

భవిష్యత్తులో కూడా స్టార్ డైరెక్టర్లు యాక్షన్ సన్నివేశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. మరోవైపు రాజమౌళి కూడా బాహుబలి3 సినిమాపై దృష్టి పెట్టారని ఈ సినిమాతో 3,000 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవాలని జక్కన్న భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వైరల్ అవుతున్న ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus