‘ప్రేమ దేశం’ తో తమిళ్ తో పాటు తెలుగులో కూడా క్రేజ్ ను సంపాదించుకున్నాడు హీరో అబ్బాస్.అమ్మాయిలకు కలలు రాకుమారుడిగా మారిపోయాడు. యువతలో కూడా అబ్బాస్ కు మంచి ఫాలోయింగ్ పెరిగింది. ‘ప్రేమదేశం’ అనే ఒక్క హిట్ సినిమా ప్రభావం వల్ల తర్వాత అతనికి వరుస సినిమాల్లో అవకాశాలు దక్కాయి. కానీ సరైన కథల్ని ఎంపికచేసుకోవడంలో అతను విఫలమయ్యాడు. ‘ప్రేమదేశం’ రేంజ్ హిట్ మళ్ళీ అతని ఖాతాలో పడలేదు. బాలకృష్ణ ‘కృష్ణబాబు’, వెంకటేష్ ‘రాజా’, రజినీకాంత్ ‘నరసింహ’, కమల్ హాసన్ ‘బ్రహ్మచారి’ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించినా కూడా అవి ఇతనికి కలిసిరాలేదు.
‘ప్రేమదేశం’ కాంబోలో ‘నీ ప్రేమకై’ అనే చిత్రం చేసినా అది కూడా ఇతనికి కలిసిరాలేదు. దీంతో కొన్నాళ్ళకి విలన్ రోల్స్ చేయడం మొదలుపెట్టాడు. అటు తర్వాత ఇంకా తగ్గి ఏవేవో పాత్రలు చేసేసాడు. చివరికి అతనికి అవకాశాలు లేకుండా పోయాయి. దీంతో అబ్బాస్ కెరీర్ తక్కువ సమయంలోనే ముగిసిపోయింది. ఈ క్రమంలో బ్రతకడానికి దేశం దాటి న్యూజిలాండ్ వెళ్ళిపోయాడు.అయినా అక్కడ ఉపాధిని పొందలేకపోయాడు. ఈ క్రమంలో గత్యంతరం లేక పెట్రోల్ బంక్ లో పనిచేశాడు.
కొంతకాలం తర్వాత అది కూడా మానేసి భవన నిర్మాణానికి కూలీగా పనిచేసాడు. ఆ టైములో కనస్ట్రక్షన్ పని పై పట్టు సంపాదించి…బిల్డర్ గా మారాడు. అటు తర్వాత న్యూజిలాండ్ లో టాప్ బిల్డర్ గా పేరు తెచ్చుకున్నాడు.ఓ పక్క తన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూనే.. మోటివేషనల్ స్పీకర్ గా కూడా అబ్బాస్ పనిచేస్తున్నాడట. అలా అబ్బాస్ అక్కడే సెటిల్ అయిపోయాడు.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?