సీనియర్ సినీ నటుడు వీకే నరేష్ ఇటీవల తన వ్యక్తిగత విషయాల ద్వారా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈయన మూడు వివాహాలు చేసుకుని తన ముగ్గురు భార్యలను వదిలేసి మరొక నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉన్నారు. ఇలా వీరిద్దరి రిలేషన్ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతికి ఏమాత్రం నచ్చలేదు. దాదాపు 5 సంవత్సరాల నుంచి వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు
అయితే ఇటీవల పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చినటువంటి తరుణంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పెద్ద ఎత్తున వివాదం సృష్టించింది. ఇలా వివాదాలు ద్వారా వీరందరూ వార్తలలో నిలిచారు అయితే తాజాగా నరేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… తన ముగ్గురు భార్యలను వదిలిపెట్టడానికి అలాగే పవిత్ర లోకేష్ తో జీవితం గురించి అసలు విషయం వెల్లడించారు.
తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ ముగ్గురు భార్యలను వదిలేసానని అయితే వారి వల్ల నాకు ఏ మాత్రం సంతోషం లేదని, అందుకే నేను విడాకులు తీసుకున్నానని తెలిపారు. ఈ ప్రపంచంలో 70 నుంచి 80 శాతం మంది విడిపోతున్నారని వీరందరూ కూడా పెళ్లి చేసుకుని గొడవల కారణంగానే విడిగా ఉంటున్నారని తెలిపారు.
40 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి మనిషికి తోడు అవసరం అందుకే నేను (Naresh) పవిత్ర లోకేష్ తోడు కావాలని కోరుకున్నాను.ఆమెతో నా జీవితం చాలా సంతోషంగా ఉందని ఇకపై అలాంటి సంతోషంతో మిగతా జీవితం పూర్తీ కావాలని ఈయన కోరుకున్నారు. ఇక వీరిద్దరూ ఇటీవల మళ్ళీ పెళ్లి అనే సినిమాలో నటించడం సంగతి తెలిసిందే.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!