సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన ఏం మాట్లాడినా వివాదాస్పదంగా ఉంటుంది. ఆయన సినిమాల్లోకి వచ్చి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సంగతి కూడా తెలిసిందే. ఆయన గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ గా ‘మళ్ళీ పెళ్లి’ అనే చిత్రాన్ని రూపొందించారు. ఆయనే ఈ చిత్రానికి నిర్మాత. పవిత్ర లోకేష్.. నరేష్ కు జోడీగా నటిస్తుండడంతో ఈ సినిమాపై అందరి చూపు పడింది. ఎందుకంటే.. ప్రస్తుతం నరేష్ – పవిత్ర సహజీవనంలో ఉన్నారు.
నరేష్ కు ఆల్రెడీ మూడు పెళ్లిళ్లు అయ్యాయి. పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోవడానికి నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఒప్పుకోవడం లేదు. దీంతో నరేష్ చేసేదేమి లేక ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమా తీసుకుని సరిపెట్టుకున్నాడు. ఇది నరేష్- పవిత్ర ల బయోపిక్ అని టీజర్ చెప్పకనే చెప్పింది. తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. ఇందులో కూడా నరేష్- పవిత్ర ల రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కనిపించాయి.
కాబట్టి (Naresh) నరేష్.. కావాలనే తన భార్య రమ్య రఘుపతి పై రివెంజ్ తీర్చుకోవడానికి ఈ సినిమా తీసాడు అని అంతా అనుకుంటున్నారు. నరేష్ ను డైరెక్ట్ గా ఈ విషయం పై ప్రశ్నించగా.. ” రివెంజ్ తీర్చుకోవడానికైతే.. నేను యూట్యూబ్ లో డబ్బులు పెట్టి ట్రోలింగ్ చేయిస్తే సరిపోతుంది కదా. రూ.15 కోట్లు పెట్టి సినిమా తీయాలా? నా బయోపిక్ తీసుకునే రేంజ్ కి నేనింకా ఎదగలేదు. ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమాలో బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది.
ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకు ఓ తోడు కావాలి అనిపిస్తుంది. అదే ఈ చిత్రం ద్వారా చెప్పాలి అనుకుంటున్నాం. అంతేగాని నా జీవితంలో లేదా పవిత్ర జీవితంలో లేకపోతే ఇంకెవరో జీవితంలో జరిగిన ఇన్సిడెంట్లను తీసుకుని రివెంజ్ కోసం తీసిన సినిమా కాదు” అంటూ నరేష్ చెప్పుకొచ్చాడు. నరేష్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక ‘మళ్ళీ పెళ్లి’ చిత్రం మే 26న విడుదల కాబోతోంది.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?