Nassar: సినీ పరిశ్రమలో విషాదం.. నాజర్ తండ్రి కన్నుమూత.!

  • October 10, 2023 / 06:47 PM IST

సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిత్యం ఏదో ఒక బ్యాడ్ న్యూడ్ వింటూనే ఉన్నాం. సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, టెక్నికల్ టీం, లేదు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు.. ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్ కి చెందిన సినీ సెలబ్రిటీలు మాత్రమే కాదు, పక్క రాష్ట్రాల్లో ఉన్న సినీ ప్రముఖుల్లో కూడా ఎవరో ఒకరు మరణిస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం.

నిన్ననే టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి కూడా మరణించడం జరిగింది. దీంతో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ షాక్ నుండి ఇంకా కోలుకోక ముందే ఇప్పుడు మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే… స్టార్ నటుడు నాజర్ తండ్రి మహబూబ్ బాషా ఈరోజు కన్నుమూయడం జరిగింది. ఆయన వయసు 95 ఏళ్ళు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.

వయస్సు మీద పడటంతో ఆయన ట్రీట్మెంట్ కి కూడా తట్టుకోలేక ఇబ్బందిపడ్డారట. అందుకే ఆయన చివరి శ్వాస విడిచినట్టు స్పష్టమవుతుంది. తమిళనాడులోని చెంగల్పట్టులో ఉన్న ఆయన నివాసంలోనే మహబూబ్ బాషా కన్నుమూసినట్టు తెలుస్తుంది. ‘మహబూబ్ బాషా కూడా ముక్కుసూటి మనిషి అని, ఏదైనా కష్టపడి సాధించాలి అనుకుంటారు కానీ పక్క వాళ్ళని అడిగి తీసుకోవాలనే మనస్తత్వం ఆయనకి ఉండదని’ నాజర్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus