అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు వారికి పరిచయమైన యువ హీరో రాహుల్ రవీంద్రన్. ఈ ఒక్క సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత అతను హీరోగా చేసిన సినిమాలు బాగున్నట్లు అభినందనలు అందుకున్నాయి కానీ, బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడ్డాయి. తర్వాత చిన్న పాత్రలు వేయడానికి ఓకే చెప్పారు. శ్రీమంతుడులోను కాసేపు కనిపించి మెప్పించారు. తాజాగా రాహుల్ రవీంద్రన్ మెగా ఫోన్ అందుకోనున్నారు. సుశాంత్ సినిమాతో డైరక్టర్ గా మారబోతున్నారు.
ఈ విషయాన్ని రాహుల్ స్వయంగా ట్వీట్ ద్వారా వెల్లడించారు. “నా చిన్నప్పటి కల త్వరలో నెరవేరబోతోంది. సుశాంత్ హీరోగా ఒక చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాను” అని ట్వీట్ చేశారు. సుశాంత్ కూడా “రాహుల్ తో నా నెక్స్ట్ సినిమా ఉండబోతోంది. మీ సపోర్ట్ కావాలి” అని పోస్ట్ చేశారు. వీరిద్దరికి హాస్యనటీనటులు విద్యురామన్, వెన్నెల కిషోర్ లు ఆల్ ది బెస్ట్ చెప్పారు. దాదాపు ఒకే ఏజ్ గ్రూప్ కలిగిన హీరో, డైరక్టర్ కలిసి మంచి ప్రేమకథా చిత్రాన్ని ఆవిష్కరిస్తారనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.