సాయి కుమార్‌ షష్టిపూర్తి.. అగ్ర తారలు దిగివచ్చి సాయికుమార్‌ దంపతులను అభినందించి!

  • July 25, 2021 / 09:41 AM IST

జీవితంలో చాలా పండగలు వస్తాయి, చాలా మంచి రోజులూ వస్తాయి… అయితే వాటిలో షష్టపూర్తికి ఉన్న ప్రత్యేకతే వేరు. లైఫ్‌లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ షష్టపూర్తితోనే మొదలవుతుంది అంటారు. అలా షష్టపూర్తి జరుపుకున్నారు ప్రముఖ నటుడు సాయికుమార్. అరవయ్యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సాయి కుమార్‌ ఇటీవల షష్టిపూర్తి జరుపుకున్నారు. వేడుకగా జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై అభినందించారు.

ప్రముఖ నటుడు చిరంజీవి, వెంకటేశ్‌ తదితరులు వచ్చి సాయికుమార్‌, సురేఖ దంపతులను విషెష్‌ చెప్పారు. ఇప్పుడు ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. కార్యక్రమాన్ని సాయికుమార్‌ తనయుడు ఆది దగ్గరుండి అంతా తానై చూసుకున్నారట. సాయికుమార్‌ జులై 27, 1960లో జన్మంచారు. ఈ లెక్కన 27న ఆయన ఈ వేడుక చేసుకోవాలి. అయితే వీకెండ్‌ అనేమో ముందుగానే వేడుక పెట్టేశారన్నమాట.

సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకలో సాయికుమార్‌ కుటుంబ సభ్యులు, కొంతమంది సినీతారలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైతే చిరంజీవి, వెంకటేశ్‌ ఫొటోలు మాత్రమే బయటకు వచ్చాయి. వీళ్లు కాకుండా ఇంకా చాలామంది వచ్చారు అని తెలుస్తోంది.

1

2

3

4

5

6

7

8

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus