Satya, Chiranjeevi: చిరంజీవి పై నటుడు సత్య ప్రకాష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో చిరంజీవి ఒకరు. ఈయన స్టార్ హీరోగా మాత్రమే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి మంచి సహాయం పొందిన వారు పలు సందర్భాలలో ఆయన చేసిన సహాయం గురించి చెబుతూ ఉంటారు. తాజాగా నటుడు సత్య ప్రకాష్ కూడా చిరంజీవి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించినటువంటి సత్య ప్రకాష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. కెరియర్ మొదట్లో నాకు కారు ఉండేది కాదు తాను షూటింగుకు ఎల్‌ఎంఎల్ స్కూటర్ పై వచ్చేవాడినని తెలిపారు. ఇలా ఒకసారి చిరంజీవి అన్నయ్య సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని ఇంటికి వెళ్లాను మరుసటి రోజు ఉదయం షూటింగ్ కి వెళ్ళగానే అన్నయ్య నన్ను పిలిచారు. షూటింగ్ కి ఎలా వస్తున్నావు అని అడిగారు బండిమీద వస్తున్నాను అని చెప్పగా హెల్మెట్ పెట్టుకున్నావా అన్నారు.

లేదు అనటంతో ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా నువ్వు ఒక మంచి నటుడివి భవిష్యత్తులో గొప్ప నటుడివి అవుతావు ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే ఒక మంచి నటుడిని కోల్పోవాల్సి వస్తుంది. నేను నీకు ఫండింగ్ ఇస్తాను కారు కొనుక్కో అంటూ అక్కడే తనకు డబ్బులు ఇచ్చారని అలా అన్నయ్య ఇచ్చిన డబ్బుతో నేను మొదటి కారు కొన్నానని

ఈ కారు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ సత్య ప్రకాష్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంత మంది ఉన్నా కూడా అన్నయ్య స్థానం పైన ఉంటుంది.. ఎంత మంది ఉన్నా కూడా మెగాస్టార్ ఒక్కరే.. అది అన్నయ్యే అంటూ (Chiranjeevi) చిరంజీవి మీద సత్య ప్రకాష్ తన ప్రేమను కురిపించాడు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus