టాలీవుడ్ స్టార్స్ ట్రావెల్ బేస్డ్ అడ్వెంచ‌ర‌స్ టాక్ షో ‘సోల్ ట్రిప్’.. హోస్ట్‌గా మారిన హీరో విజ‌య్ దాట్ల

రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్మెంట్ స‌మ‌ర్ప‌ణ‌లో స్టార్ హీరోల‌తో ఓ ట్రావెల్ బేస్డ్ అడ్వెంచ‌ర‌స్ టాక్ షో ప్రారంభం కానుంది.. అదే ‘సోల్ ట్రిప్’ (Soul Trip). ఈ అడ్వెంచ‌ర‌స్ టాక్ షోలో మ‌న టాలీవుడ్ స్టార్ హీరోస్‌తో ఈ టాక్ షో ప్రేక్షకుల‌ను అల‌రించ‌నుంది. ఇది వ‌ర‌కు పోస్ట‌ర్, అన్వేషి వంటి సినిమాలు చేసిన హీరో, నిర్మాత విజ‌య్ దాట్ల త‌న సొంత బ్యాన‌ర్ గండ‌భేరుండ ఆర్ట్స్‌పై ఈ సెల‌బ్రిటీ టాక్‌షో సీజ‌న్‌1ను ముగించుకుని, త్వ‌ర‌లోనే ప్ర‌ముఖ ఓటీటీ ఛానెల్‌లో రిలీజ్ చేయ‌బోతున్నారు.

గ‌ణ‌తంత్య దినోత్స‌వం సంద‌ర్భంగా ‘సోల్ ట్రిప్’ టాక్ షో పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ మొద‌టి సీజ‌న్‌లో హీరో జ‌గ‌ప‌తిబాబు, శ్రీకాంత్‌, స్టార్ కమెడియ‌న్ అలీ, హీరోయిన్స్ శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్, వ‌ర్ష బొల్ల‌మ్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.

సాంకేతిక నిపుణులు:

కాన్సెప్ట్ – హోస్ట్ – డైరెక్ట‌ర్ : విజ‌య్ దాట్ల‌
ప‌వ‌ర్డ్ బై త‌మ‌డా మీడియా
స‌హ నిర్మాత‌లు: పి.యు.ఎన్ వర్మ‌, ఖుషి, కొల్లి గోపాల్ కృష్ణ‌, చైత‌న్య క‌లిదింది, కన్నా శ్రీకృష్ణ‌,
సినిమాటోగ్ర‌ఫీ: అచ్యుత్ వ‌ర్మ‌
మ్యూజిక్‌: సాహిత్య సాగ‌ర్‌
ఎడిట‌ర్‌: అనీల్ అల్లూరి
క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌: కార్తీక్ అన్నం
కాస్టింగ్: అమ‌ర్ పుట్ట‌
క్రియేటివ్ రైట‌ర్‌: నివాస్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus