Actress Annapurna: సుమ దంపతులకు శాపం పెట్టిన అన్నపూర్ణ!

ప్రముఖ సినీ నటి అన్నపూర్ణ తన కెరీర్ లో వందల సినిమాలు చేసింది. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కనకాల ఫ్యామిలీపై చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల కారణంగా ఓ ల్యాండ్ ఇష్యూలో మోసపోయానని చెబుతోంది అన్నపూర్ణ. ఆయన చనిపోవడంతో ఇష్యూని సుమ, రాజీవ్ ల దగ్గర ప్రస్తావించానని కానీ లాభం లేకుండా పోయిందని చెబుతోంది.

మరిన్ని విషయాలు చెబుతూ.. ”ఈ ఇష్యూపై రాజీవ్ కనకాలకు ఒకసారి ఫోన్ చేశా.. అప్పుడు మాట్లాడాడు. ఆ తరువాత ఎప్పుడు చేసినా బిజీ వస్తుంది. దీంతో మధ్యవర్తితో ఆయన ఫోన్ పని చేయడం లేదని.. నెంబర్ కరెక్టేనా అని అడగడంతో నా దగ్గర ఉన్న నెంబరే ఇచ్చారు. అప్పుడు తెలిసింది.. బ్లాక్ చేశారని. రాజీవ్ కనకాల తనకేం తెలియదని అంటున్నారని మధ్యవర్తి చెప్పారు. గతంలో గొడవ జరిగినప్పుడు కూడా రాజీవ్ కనకాల ఉన్నాడు. కనీసం మొత్తం భూమి ఇవ్వకపోయినా.. ఎంతోకొంత ఇవ్వమని మధ్యవర్తిని అడిగితే.. వాళ్ల దగ్గర ఏం లేదంటమ్మా అని” చెప్పిన విషయాలను గుర్తు చేసుకున్నారు.

22 ఏళ్ల క్రితమే దేవదాస్ కనకాల తనకు భూమిని అమ్మారని.. తనకు అమ్మిన భూమినే మళ్లీ వెంచర్ వేసి వేరే వాళ్లకు అమ్మేశారని తెలిపింది అన్నపూర్ణ. దేవదాస్ కనకాల తనకు భూమిని అమ్మిన విషయం ఆయన కుటుంబంలో అందరికీ తెలుసనీ.. కానీ తెలియదన్నట్లుగా ప్రవర్తించిన విషయాలను చెప్పుకొచ్చింది. వాళ్లేమైనా భూమిని పట్టుకొని ఉంటారా..? నేను పెట్టుకోకుండా పోతానా..? కాస్త ముందు నేను పోతా.. వెనుక వాళ్లు వస్తారంతే.. అందరం పోయేవాళ్లమే అంటూ చెప్పుకొచ్చింది.

ఇది శాపం అనుకోండి.. ఏదైనా అనుకోండి అంటూ సుమ దంపతులను ఉద్దేశిస్తూ చెప్పుకొచ్చింది. ఈ భూమి విషయంలోనే కాకుండా ఏపీలో కూడా అప్పట్లో చాలా భూమిని కొన్నానని.. అప్పుడు కూడా చాలా గొడవలు జరిగాయని చెప్పుకొచ్చింది. తను కొన్న రెండున్నర ఎకరాల భూమిని.. ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలనుకుందని.. దీనిపై కోర్టులో ఫైట్ చేస్తే.. 12 ఏళ్ల తరువాత ఆ భూమి తిరిగొచ్చిందని చెప్పుకొచ్చింది.


పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus