తెలుగమ్మాయి ఈషా రెబ్బా కెరీర్లో పెద్ద హిట్లు ఏమీ లేవు….కానీ సెమీ స్టార్ హీరోయిన్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ తో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు అటు తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంతకు ముందు ఆ తరువాత’ చిత్రంలో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా చేసి డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.
అటు తర్వాత కూడా ‘బందిపోటు’ ‘అమీ తుమీ’ ‘దర్శకుడు’ ‘అ!’ ‘అరవింద సమేత వీర రాఘవ’ ‘సవ్యసాచి’ ‘రాగల 24 గంటల్లో’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి చిత్రాల్లో నటించింది. ‘లస్ట్ స్టోరీస్’ రీమేక్ అయిన ‘పిట్ట కథలు’ వెబ్ మూవీలో కూడా నటించింది. మొదట్లో గ్లామర్ షోకి దూరంగా వుంటూ వచ్చిన ఈ అమ్మడు తర్వాత ట్రెండ్ కు తగినట్టుగా తన లుక్ ను మార్చుకుంటూ కుర్రకారుకి మంచి ఫీస్ట్ ఇస్తుంది.
ఈమె తాజా ఫోటోలను చూస్తే గ్లామర్ షో చేయడంలో ఎంత ఇంప్రూవ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :