‘ఒక్క ఛాన్స్ ప్లీజ్’ అంటూ అడుక్కోను.. ముక్కుసూటిగా నొ చెబుతాను’ అందుకే నాకు ఆఫర్లు రావడం లేదు’ అంటుంది నటి షాలు షమ్ము. బహుశా ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా తెలిసి ఉండదు. తమిళ సినిమాల్లో పలు డీగ్లామరస్ పాత్రలు చేసి అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు తెలుగులో కూడా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఈ క్రమంలో ఓ యువ దర్శకుడు ఈమెను సంప్రదించి.. ‘యువ హీరో సినిమాలో అవకాశం ఇస్తాను.. అయితే ఓ బడా హీరోతో లింకప్ అవ్వాలి’ అంటూ కోరాడట.
అతని మాటలు విన్న షాలు.. ‘ఈ మేటర్ ను ఎలా హ్యాండిల్ చెయ్యాలో తెలుసు కాబట్టి #మీటూ వేదికను ఆశ్రయించలేదని’ చెప్పుకొచ్చింది. ‘#వియ్ నీడ్ ఛేంజ్..# స్టాప్ హరాష్ మెంట్.. #వియ్ నెవర్ కాంప్రమైజ్’ అనే హ్యాష్ ట్యాగ్ లను పెట్టి ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ టాపిక్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుండడంతో చాలా మంది నెటిజన్లు ఈమెకు మద్దతు పలుకుతున్నారు. అంతేకాదు టాలీవుడ్ సిర్కిల్స్ లో కూడా ఈ విషయం పై పెద్ద చర్చ జరుగుతుందని గుస గుసలు వినిపిస్తున్నాయి.
‘ఆ యువ దర్శకుడు ఎవరు.. ఆ బడా హీరో ఎవరు.. ఆ యంగ్ హీరో సినిమా ఏంటి’ అంటూ ఆ డిస్కషన్లు నడుస్తున్నట్టు సమాచారం. గతంలో ‘#మీటూ’ అంటూ చాలా మంది నటీమణులు పలువురు పెద్దల పై ఆరోపణలు చేసినప్పటికీ అవి 4 రోజుల్లో చల్లారిపోయాయి. కానీ ఇది మాత్రం చాప కింద నీరులా పాకుతుంది. చూడాలి.. ఇది ఎంత వరకూ వెళ్తుందో..!
Most Recommended Video
ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!