Hansika: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గా మారాలని ఉంది!

  • July 4, 2023 / 12:07 PM IST

నటి హన్సిక మోత్వాని వివాహం చేసుకొని ఏడు నెలలు అయింది ఈ క్రమంలోనే ఈమె తన వైవాహిక జీవితంలోనూ అలాగే తన సినీ కెరియర్ లోను ఎంతో బిజీగా సంతోషంగా గడుపుతున్నారు.పెళ్లి తర్వాత సినిమాలకు దూరమవుతారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి కానీ ఆ వార్తలను ఖండిస్తూ ఈమె వరస తమిళ హిందీ భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈమె తమిళంలో హీరో ఆది పినిశెట్టితో కలిసి పార్టనర్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

ఇలా ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చెన్నై చేరుకున్నటువంటి ఈమె ఆదివారం ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా హన్సిక ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.తన జీవితం ప్రస్తుతం చాలా హ్యాపీగా కొనసాగుతుందని తెలిపారు. నటన జీవితానికి తన భర్త ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదని ఇక తన తల్లి సపోర్ట్ తనకు చాలా ఉందని ఈమె తెలిపారు.

తనుకు (Hansika) నటిగా 50 సినిమాలలో నటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అయితే తనకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి కానీ ఎలాంటి లక్ష్యం లేదని తెలిపారు. ఒక మంచి మనిషిగా అందరి మనసులలో నిలిచిపోతే చాలని ఈమె తెలిపారు. ఇక ఈమె నటించినా పార్ట్నర్ సినిమాలో తాను పురుషుడిగా మారే ఒక పాత్రలో నటించానని తెలిపారు ఇందులో తన పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని హన్సిక తెలిపారు.అయితే ఇలాంటి తరహా పాత్రలలో నటించాలని ఏమీ లేదని కథ నచ్చితే ఏ పాత్రలోనైనా తాను నటిస్తానని తెలిపారు.

ఇక ఇండస్ట్రీలో జయప్రజయాలు అనేది గ్యాంబ్లింగ్ అని సీనియర్ దర్శకుడైన నూతన దర్శకుడైన కథ నచ్చితే నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఇక ఈ సినిమాలో తాను పురుషుడిగా మారే పాత్రలో నటించానని తెలిపారు. అయితే నిజ జీవితంలో ఒకవేళ మారాల్సి వస్తే ఎవరిలా మారుతారు అంటూ ఈమెను ప్రశ్నించగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లాగా మారిపోవాలని కోరుకుంటాను అంటూ ఈ సందర్భంగా హన్సిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus