పెళ్లికి తల్లి చీరలో తారలు.. ఫొటోలు వైరల్‌

అమ్మ చీర, నాన్న చొక్కా, అన్నయ్య టీ షర్ట్‌… ఇవన్నీ చూడటానికి మామూలుగానే ఉంటాయేమో. కానీ వాటిని ధరిస్తే ఇంట్లో ఆడబిడ్డకు వచ్చే కిక్కే వేరు. ఏదో తెలియని కేరింగ్‌ నెస్‌, బోలెడంత ధైర్యం వచ్చేస్తాయి. ప్రత్యేక సందర్భాల్లో అవి ఇంకా స్పెషల్‌. అలా నిహారిక తన వివాహం సందర్భంగా తన తల్లి చీర ధరించింది. ఈ నేపథ్యంలో వివాహ సమయంలో తల్లి చీరలు/డ్రెస్‌లు ధరించిన నాయికల ఫొటోలు వైరల్‌గా మారాయి. వాటిపై ఓ లుక్కేయండి.

* కొణిదెల కుటుంబంలో చిన్న కూతురు నిహారిక పెళ్లి చైతన్యతో జరగనున్న విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఓ హోటల్‌లో వీరి వివాహం సందడిగా జరగనుంది. ఈ సందర్భంగా ఇటీవల నిహారిక తన తల్లి పద్మజ నిశ్చితార్థం చీరలో మెరిశారు. పెళ్లి వేడుకల్లో భాగంగా తన తల్లి అప్పట్లో కట్టుకున్న పట్టుచీరకు మెరుగులు అద్ది తాజాగా ధరించారు.

* యువతను తన అందాలతో కట్టిపడేసిన బాలీవుడ్‌ భామ కరీనా కపూర్‌. సైఫ్‌ అలీ ఖాన్‌ను వివాహం చేసుకుని పటౌడీ కుటుంబంలోకి అడుగుపెట్టింది. ఆ సమయంలో తన అత్త షర్మిలా ఠాగూర్‌ ధరించిన గాగ్రాను ధరించి పెళ్లికుమార్తెగా ముస్తాబైంది. గోల్డ్‌ ఎంబ్రయిడరీ చేసిన ఆ చీరను డిజైనర్‌ రీతూ కుమార్‌ సరికొత్త తీర్చిదిద్దారు.

* గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా కూడా ఇదే పని చేసింది. ప్రియాంక-నిక్‌ వివాహం భారతీయ సంప్రదాయంతో పాటు, క్రైస్తవ సంప్రదాయంలోనూ జరిగింది. క్రైస్తవ వివాహ పద్ధతిలో జరిగిన వేడుకకు ప్రియాంక ప్రత్యేక గౌను ధరించారు. నిక్‌ తల్లి వివాహం సందర్భంగా ధరించిన గౌనులోని కొంత భాగాన్ని తీసుకుని ప్రియాంక గౌనును తయారు చేశారట.

*అనీల్‌ కపూర్‌ కుమార్తె, బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ తన తల్లి వివాహం సందర్భంగా ధరించిన నగలను ధరించారు. సోనమ్‌ ధరించిన ప్రతి నగ తన తల్లి సునీతా కపూర్‌ ధరించిందే కావడం గమనార్హం. తల్లి దుస్తుల్లో స్వల్ప మార్పులు చేసి వాటినే సోనమ్‌ ధరించింది.


Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus