Indraja: ఇంద్రజ భర్తకు అలాంటి షరతులు విధించారా?

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో ఒకరైన ఇంద్రజ ప్రస్తుతం పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారనే సంగతి తెలిసిందే. యమలీల సినిమాతో గుర్తింపును సంపాదించుకున్న ఇంద్రజ పలువురు స్టార్ హీరోలకు జోడీగా నటించి మెప్పించడం గమనార్హం. సంగీతం, నృత్యంపై అభిరుచి అమ్మతోనే వచ్చిందని ఇంద్రజ వెల్లడించారు. అమ్మ దగ్గర నేర్చుకోవడానికి వచ్చే విద్యార్థుల ద్వారా నాకు పాటలు అలవాటయ్యాయని ఆమె వెల్లడించారు. ఎమ్.వీ.ఎన్. మూర్తి దగ్గర కూచిపూడి తంగం మేడమ్ దగ్గర భరతనాట్యం నేర్చుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

హీరోయిన్ గా నా తొలి సినిమా జంతర్ మంతర్ అని ఆమె అన్నారు. ఆ సినిమా షూట్ సమయంలో కృష్ణారెడ్డిగారు నన్ను కలిసి యమలీల సినిమాలో ఛాన్స్ ఇచ్చారని ఆమె చెప్పుకొచ్చారు. యమలీల మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో నాకు వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయని ఆమె చెప్పుకొచ్చారు. అలీ సినిమాలలో ఎలా ఉంటారో బయట కూడా అలానే ఉంటారని ఇంద్రజ అన్నారు. రాజేంద్ర ప్రసాద్ కు అన్ని క్రాఫ్ట్ లు తెలుసని ఆయనను డైరెక్షన్ చేయాలని కోరానని ఇంద్రజ చెప్పుకొచ్చారు.

తెలుగులో చేస్తున్న సమయంలోనే తమిళంలో ఆఫర్లు వచ్చాయని ఆమె వెల్లడించారు. తమిళంలో మూడు నాలుగు సినిమాలలో నటించానని ఇంద్రజ కామెంట్లు చేశారు. మాది లవ్ మ్యారేజ్ అని పెళ్లికి సంబంధించి రిసెప్షన్ చేయలేదని హనీమూన్ కు కూడా వెళ్లలేదని ఆమె తెలిపారు. పెళ్లికి ముందు భర్తకు షరతులు పెట్టారా అనే ప్రశ్నకు స్పందిస్తూ అమ్మ, నాన్న నాతోనే ఉంటారని వాళ్లను వదిలేసి రాలేనని అమ్మానాన్నల బాగోగులు నేనే చూసుకుంటానని చెప్పానని అమె చెప్పుకొచ్చారు.

చెల్లెళ్లకు పెళ్లి చేయాల్సిన బాధ్యత నాపై ఉంటుందని కూడా నేను చెప్పానని ఆమె కామెంట్లు చేశారు. ఇంద్రజ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమెకు రోజురోజుకు క్రేజ్ పెరుగుతోందనే సంగతి తెలిసిందే.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus