అనసూయ(Anasuya), శివాజీ..ల ఇష్యూ అందరికీ తెలిసిందే. ఈ విషయంలో అనసూయపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. అయితే అనుకోకుండా ఈ ఇష్యూలోకి సీనియర్ హీరోయిన్ రాశిని తీసుకొచ్చారు నెటిజెన్లు. గతంలో అనసూయ ఓ స్కిట్లో భాగంగా పలికిన ‘రాశి గారి ఫలాలు’ అనే డైలాగ్ పై ఆమెను తిట్టిపోస్తూ.. నిలదీస్తున్నారు నెటిజెన్లు. తాజాగా రాశి సైతం ఆ విషయంలో హర్ట్ అయినట్టు మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు.
దీంతో అనసూయ కూడా ఎస్కేప్ అవ్వకుండా తన సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు చెబుతూ ఓ లెటర్ ను పోస్ట్ చేసింది.ఆ లెటర్ ద్వారా ఆమె స్పందిస్తూ.. “మూడు సంవత్సరాల క్రితం ఒక షోలో తెలుగు సరిగ్గా రాని తనం కారణంగా మీ పేరును నా ద్వారా డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో చెప్పించారు. నిజానికి అలా రాసిన డైరెక్టర్ ను నేను ఆ రోజే నిలదీసి ఉండాల్సింది. కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు.
అది పొరపాటే. దయచేసి నా క్షమాపణలను స్వీకరించండి. మనుషుల్లో మార్పు సహజం. అందుకే నేను ఆ షోలో ద్వంద్వార్థపు మాటలను ఖండించడంతో పాటు దాన్ని విడిచి వచ్చేశాననే విషయం మీరు గ్రహించగలరు. మహిళ భద్రత గురించి నేను గట్టిగా మాట్లాడుతున్నందుకు నా పై హేట్ క్యాంపైన్ నడిపిస్తున్నారు. నన్ను షేమ్ చేయడానికి చేస్తున్న ఈ కథనాలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో ఊహించగలను.
ఆ కార్యక్రమం దర్శక నిర్మాతలు మీకు క్షమాపణలు చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యతగా నా తప్పుని అంగీకరిస్తూ మీకు క్షమాపణలు చెబుతున్నాను” అంటూ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చింది అనసూయ.