‘ది రాజాసాబ్’ ‘పెద్ది’ టు ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. ఈ ఏడాది అలరించనున్న క్రేజీ సినిమాల లిస్ట్!

2025 లో స్టార్ హీరోల సినిమాల సందడి పెద్దగా కబడలేదు.పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి హీరోల సినిమాలు వచ్చినా వాటి ప్రభావం బాక్సాఫీస్ వద్ద ఏమీ కనిపించలేదు. అందుకే 2026 పైనే టాలీవుడ్ చాలా హోప్స్ పెట్టుకుంది. సంక్రాంతి నుండి సమ్మర్ వరకు స్టార్ హీరోల సినిమాలతో థియేటర్లు కళకళలాడే అవకాశం కనిపిస్తుంది. మరి ఆ క్రేజీ లైనప్ ఏంటో, ఎవరెవరు బరిలో ఉన్నారో, రేసులో లేని స్టార్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

Telugu Movies in 2026

కొత్త ఏడాదిని ప్రభాస్ గ్రాండ్‌గా స్టార్ట్ చేయబోతున్నాడు. మారుతి డైరెక్షన్‌లో వస్తున్న ‘ది రాజా సాబ్’ 2026, జనవరి 9న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ‘సలార్’ ‘కల్కి 2898 AD’ వంటి సూపర్ హిట్లతో ప్రభాస్ ఫామ్లో ఉన్నాడు. పైగా ‘ది రాజాసాబ్’ లో వింటేజ్ లుక్స్ లో కనిపిస్తున్నాడు ప్రభాస్. ప్రమోషనల్ కంటెంట్ సో సోగా ఉన్నా… ప్రభాస్ కోసం కచ్చితంగా చూడాలనిపించే ఫీల్ మాత్రం ఇచ్చాయని చెప్పాలి.

రాజాసాబ్ వచ్చిన 3 రోజులకి మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ తో బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేసేందుకు రెడీ అయ్యారు. సంక్రాంతి పండుగను టార్గెట్ చేసి తీసిన సినిమా ఇది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతో కచ్చితంగా చిరంజీవి కంబ్యాక్ ఇస్తారని అంతా భావిస్తున్నారు.

సంక్రాంతి సందడి ముగిసిన వెంటనే ‘స్వయంభు’తో ప్రేక్షకులను అలరించేందుకు ముస్తాబవుతున్నాడు నిఖిల్. అతని కెరీర్లో హయ్యెస్ట్ బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది. వారియర్ పాత్రలో నిఖిల్ నటిస్తున్న ఈ సినిమాను భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తున్నాడు. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2026, ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

అడవి శేష్, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘డెకాయిట్’ మార్చి మధ్యలో రానుంది. ఈ సినిమాపై ఆడియన్స్ కి మంచి అంచనాలే ఉన్నాయి.

ఇక బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్ చేస్తున్న ‘పెద్ది’ సినిమా మార్చి 27న రిలీజ్ కానుంది. ‘చికిరి’ పాటతో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. కచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకుంటుందనే నమ్మకం ఫ్యాన్స్ లో కనిపిస్తుంది.

‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో నాని ‘ది పారడైజ్’ అనే మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మార్చి 26న రిలీజ్ కానుంది.

ఇక పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా ఏప్రిల్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో పవన్- హరీష్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

అలాగే సమ్మర్ లో ‘ధురంధర్ 2’ కూడా రానుంది. ‘ధురంధర్’ పెద్ద బ్లాక్ బస్టర్ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసారి తెలుగు వెర్షన్ ను కూడా రిలీజ్ చేయనున్నారు.

సమ్మర్ రేసులోలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన మరో సినిమా ‘విశ్వంభర’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. మే చివర్లో లేదా జూన్‌ మొదటి వారంలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

‘వీరసింహారెడ్డి’ తర్వాత బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబోలో రూపొందుతున్న మరో మాస్ అండ్ యాక్షన్ మూవీ కూడా 2026 సెకండాఫ్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న ‘ఫౌజీ’ షూటింగ్ స్పీడ్‌ను బట్టి 2026 చివర్లోనే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ‘మైత్రి మూవీ మేకర్స్’ నిర్మిస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి క్రేజీ స్టార్లు 2026 లో కనిపించే అవకాశాలు లేకపోవడం ఒక డిజప్పాయింట్మెంట్ అని చెప్పాలి.

అఖండ 2.. హిట్ 3 .. 2025 లో వచ్చిన సీక్వెల్స్ లిస్ట్!

 

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags