Jyothi Rai: ప్రియుడితో రిలేషన్ కన్ఫర్మ్ చేసిన నటి !

బుల్లితెరపై కన్నడ సీరియల్స్ నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి జ్యోతిరాయ్ ఒకరు. ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ లో ప్రస్తుతం జగతి పాత్రలో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ పాత్రలో ఎంతో పద్ధతిగా కనిపించే ఈమె సోషల్ మీడియాలో మాత్రం అందాల ఆరబోతలో మరో లెవల్ అని చెప్పాలి. ఈ విధంగా జ్యోతి తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.

అసలు ఈమెకు (Jyothi Rai) జగతి మేడంకు ఏమైనా పోలికలు ఉన్నాయా అంటూ ఆశ్చర్యపోయారు. ఇకపోతే జ్యోతి 20 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేసుకుని ఒక కుమారుడికి జన్మనిచ్చారు అయితే కొన్ని కారణాల వల్ల తన భర్తకు విడాకులు ఇచ్చినటువంటి ఈమె మరొక డైరెక్టర్ తో ప్రేమలో ఉన్నారు. ఇలా సుక్ పూర్వజ్ అనే యంగ్ డైరెక్టర్ తో రిలేషన్ లో ఉన్నట్టు ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు చూస్తే అర్థమవుతుంది.

ఇలా ఆయనతో చనువుగా దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీరి గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి అయితే తాజాగా ఈ రూమర్లను రిలేషన్ గా మార్చబోతున్నారని తెలుస్తోంది. తాజాగా డైరెక్టర్ తో కలిసి ఈమె దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రింగ్ ఉన్నటువంటి ఒక ఎమోజిని షేర్ చేశారు.

దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోలు చూసిన వారందరూ వీరిద్దరూ ఎంగేజ్మెంట్ జరుపుకున్నారా అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఇలా ఈమె ఈ ఫోటోలను షేర్ చేయడంతో వీరి రిలేషన్ అధికారికంగా ప్రకటించారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus