‘నా ఆటోగ్రాఫ్’ హీరోయిన్ కనిక ఇప్పుడెలా ఉందో చూశారా!.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

రవితేజ ‘నా ఆటోగ్రాఫ్ – స్వీట్ మెమరీస్’ హీరోయిన్ కనిక గుర్తుందా?.. అప్పటికి ముగ్గురితో ప్రేమలో పడి ఫెయిల్ అయిన హీరో.. చివరికి కనిక క్యారెక్టర్‌ని పెళ్లి చేసుకుంటాడు. అంతకుముందు ‘ఫైవ్ స్టార్’ అనే తమిళ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది కనిక. నటి స్నేహ భర్త ప్రసన్న ఇందులో హీరో.. రవితేజ కంటే ముందు శ్రీకాంత్ ‘ఒట్టేసి చెప్తున్నా’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కనిక తర్వాత తెలుగులో నటించలేదు కానీ కన్నడలో ఓ మూవీ, తమిళంలో కొన్ని చిత్రాలు చేసింది. మళయాళంలోనే ఎక్కువగా యాక్ట్ చేసింది.

తమిళనాడుకి చెందిన కనిక అసలు పేరు దివ్య వెంకటసుబ్రమణియన్.. నటిగానే కాకుండా సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ హోస్ట్‌గానూ మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంది. 2008లో శ్యామ్ రాధాకృష్ణన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి ఓ బాబు ఉన్నాడు. ఎక్కువగా తమిళ్, మలయాళంలో మూవీస్ చేస్తున్న కనిక ఇన్‌స్టాగ్రామ్‌లో తన ప్రొఫెషన్, పర్సనల్ అప్‌డేట్స్ షేర్ చేస్తుంటుంది. ఇప్పటికీ చక్కటి ఫిజిక్ మెయింటెన్ చేస్తుంది. ఆమె పోస్ట్ చేసే పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus