Kasthuri: ఆమె ఉండుంటే అలాంటి కామెంట్స్ చేసేవారా.. కస్తూరి కామెంట్స్ వైరల్!

ఈ మధ్య కాలంలో స్టార్ హీరోయిన్ త్రిష పలు వివాదాల్లో చిక్కుకోవడం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. త్రిష ఎలాంటి తప్పు చేయకపోయినా ఆమెపై నిందలు వేస్తుండటం ఫ్యాన్స్ ను తీవ్రస్థాయిలో బాధ పెడుతోంది. అయితే త్రిషకు మద్దతుగా ఇప్పటికే విశాల్ కామెంట్లు చేయగా తాజాగా ఆ జాబితాలో కస్తూరి కూడా చేరారు. ఒకప్పుడు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న కస్తూరి ప్రస్తుతం సీరియళ్లతో బిజీగా ఉన్నారు. తమిళనాడు మాజీ ఎమ్మెల్యే ఏవీ రాజు త్రిషపై చేసిన కామెంట్ల గురించి కస్తూరి స్పందిస్తూ ఈ మధ్య కాలంలో హీరోయిన్లపై దూషణలు పెరిగాయని ఏమాత్రం నిజానిజాలు చూసుకోకుండా నోటికొచ్చింది వాగేస్తున్నారని ఆమె తెలిపారు.

నోరు, నాలుకలు ఉంటే సరిపోదని మనం ఏం మాట్లాడుతున్నామో అనే బుద్ధి కూడా ఉండాలని కస్తూరి కామెంట్లు చేశారు. గతంలో మన్సూర్ అలీ ఖాన్ సైతం త్రిష గురించి ఇలాంటి చెత్త కామెంట్స్ చేశాడని ఆమె తెలిపారు. ఏవీ రాజు చేసిన తరహా కామెంట్లు సమాజానికి మంచివి కావని కస్తూరి చెప్పుకొచ్చారు. త్రిష పేరును తెరపైకి తెచ్చి చిల్లర వ్యాఖ్యలు చేయడం ఏంటని కస్తూరి ప్రశ్నించారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిలు తప్పు పనులు చేసే అమ్మాయిలలా కనిపిస్తున్నారా అని ఆమె ప్రశ్నించారు.

ఇలాంటి వ్యాఖ్యల వల్ల రాజకీయ నాయకులపై గౌరవం తగ్గుతుందని ఆమె (Kasthuri) తెలిపారు. జయలలిత గారు బ్రతికి ఉంటే ఇలాంటి కామెంట్లు చేసేవారా అని కస్తూరి ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు తలచుకుంటే బాధగా అనిపిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. త్రిష సైతం ఏవీ రాజుపై న్యాయపోరాటం చేస్తున్నారు. త్రిషకు కోర్టులో కచ్చితంగా న్యాయం జరుగుతుందని అభిమానులు భావిస్తున్నారు. త్రిష తెలుగులో వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు. ఆమె రెమ్యునరేషన్ పరిమితంగా ఉందని తెలుస్తోంది.

‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus