Kasthuri, Shriya: హీరోయిన్ శ్రీయ వల్ల కస్తూరి పై ట్రోలింగ్.. ‘నువ్వు చేస్తే తప్పు’ కాదా అంటూ..!

సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రీయ శరన్ ఈ మధ్య కాలంలో ఓ రేంజ్లో గ్లామర్ షో చేస్తుంది. అందుకు కారణం ఆమె చేతిలో ఎక్కువ ఆఫర్లు లేకపోవడం అనే చెప్పాలి. అందుకే ఆమె తన గ్లామర్ నే నమ్ముకుంది. ఈ క్రమంలో ఆమె రెచ్చిపోయి గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటుంది.ఆ తర్వాత తన సోషల్ మీడియా ఖాతాల్లో ఆ ఫోటోలను షేర్ చేస్తూ వస్తోంది. అవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలపై కొంతమంది నెటిజన్లు పాజిటివ్ గా మరికొంత నెటిజన్లు నెగిటివ్ గా చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. అవి కామన్ అనే చెప్పాలి. అయితే శ్రీయ ఫోటోల పై తాజాగా ‘గృహలక్ష్మీ’ బ్యూటీ చేసిన కామెంట్స్ కొత్త విమర్శలకు దారి తీశాయి. అవి శ్రీయ పై కూడా.. కస్తూరి పై అని చెప్పాలి. విషయం ఏంటి అంటే శ్రీయ ఓ కొత్త డ్రెస్ వేసుకుని.. ఫోటో షూట్లలో పాల్గొంది.

ఆ ఫోటోలు చూస్తే (Shriya) శ్రీయ హద్దులు మీరు గ్లామర్ షో చేసినట్టు స్పష్టమవుతుంది. కానీ ఆమెకు, నెటిజెన్లకి ఇది సాధారణ వ్యవహారమే. కాకపోతే ఆ ఫోటోల పై నటి కస్తూరి ‘ నోనోనో.. స్టైయిల్‌ ఫెయిల్‌’ అంటూ కామెంట్‌లు పెట్టింది. అంతే.. కస్తూరి పై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ జనాలు ట్రోలింగ్ కి దిగారు. గతంలో కస్తూరి కూడా బికినీ వేసుకుని బోల్డ్ ఫోటో షూట్లు చేసింది. అందుకే నెటిజన్లు ‘నువ్వులు చేస్తే తప్పు కాదా మరి’ అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus