Keerthy Suresh: నా పెళ్ళికి మీ ఆసక్తి ఏంటి… మరోసారి పెళ్లిపై స్పందించిన కీర్తి సురేష్!

నటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రస్తుతం ఈమె తెలుగు తమిళ భాష సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి కీర్తి సురేష్ తరచూ తన వ్యక్తిగత విషయాల వల్ల వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈమె పెళ్లి గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త తరచూ వైరల్ అవుతూనే ఉంది.

ఇకపోతే కీర్తి సురేష్ గత కొద్ది రోజుల క్రితం ఒక అబ్బాయి తో కలిసి దిగినటువంటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇందులో వీరిద్దరూ ఒకే ఔట్ ఫిట్ వేసుకొని ఉండడంతో కీర్తి సురేష్ ను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి అంటూ తన గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదని కీర్తి సురేష్ కొట్టిపారేశారు. నేను పెళ్లి చేసుకుంటే ముందు ఆ విషయం మీకే చెబుతానని క్లారిటీ ఇచ్చారు.

ఇలా పెళ్లి గురించి ఈమె క్లారిటీ ఇచ్చినప్పటికి తన పెళ్లి వార్తలు ఆగలేదు. నీతో కీర్తి సురేష్ తండ్రి ఈ వార్తలపై స్పందిస్తూ కీర్తి సురేష్ తో ఫోటో దిగిన అబ్బాయి మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ లాంటివాడు తన గురించి మాకు తెలుసు.కీర్తికి పెళ్లి చేయాలి అనుకుంటే మేమే ఆ విషయం మీకు చెబుతాము అంతవరకు సైలెంట్ గా ఉండండి ఈ పెళ్లి వార్తల వల్ల ఇంట్లో ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా పోతుంది అంటూ ఆయన కూడా పెళ్లి వార్తలపై స్పందించిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా కీర్తి సురేష్ (Keerthy Suresh) పెళ్లి వార్తలు గురించి తన తండ్రి క్లారిటీ ఇచ్చిన ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు. అయితే తాజాగా ఈమె ఉదయనిది స్టాలిన్ సరసన నటించిన మామనన్ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమంలో భాగంగా మరోసారి తన పెళ్లి వార్తలపై స్పందించారు. ఈ సందర్భంగా కీర్తి సురేష్ స్పందిస్తూ…ఇప్పటికే నా పెళ్లి గురించి అందరికీ క్లారిటీ ఇచ్చాను అయినా తరచూ ఇదే ప్రశ్న అడుగుతున్నారు.

నా పెళ్లి గురించి ఎందుకు అంత ఆసక్తి చూపుతున్నారు.ఒకవేళ పెళ్లి కుదిరితే నేనే ఈ విషయాన్ని చెబుతాను అంతవరకు ఈ ప్రశ్నలు ఎవరు అడగకండి అంటూ ఈ సందర్భంగా మరోసారి పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus