మొన్న పూర్ణ.. నిన్న మోహన్ బాబు.. నేడు కుష్బూ..?

  • August 6, 2020 / 10:53 PM IST

ఈ మధ్య కాలంలో సినిమా సెలబ్రిటీలను కూడా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. వారిని బ్లాక్ మెయిల్ చేసి రివెంజ్ తీర్చుకోవాలని కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ‘సీమటపాకాయ్’ హీరోయిన్ పూర్ణను పెళ్లి పేరుతో మోసం చేసిన ఓ ముఠా.. వాళ్లకి ఫోన్ చేసి కోటి రూపాయలు డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తాం అని బెదిరించారట. చివరికి ఆ గ్యాంగ్ ను పోలీసులు కనుగొన్నారు అనుకోండి.! అటు తరువాత మొన్నటికి మొన్న మోహన్ బాబు ఇంట్లోకి ఓ కారులో కొందరు దుండగులు దూసుకువచ్చి..

‘చంపేస్తాం’ అని బెదిరించడం కూడా పెద్ద కలకలం సృష్టించింది. ఆ కారులో వచ్చిన వారిని కూడా పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళ వెనక ఎవరు ఉన్నది తెలుసుకోవడానికి.. ప్రస్తుతం వారిని ఇంటరాగేట్ చేస్తున్నారు. ఈ ఘటన జరిగి వారం రోజులు పూర్తికాకుండానే.. ఇప్పుడు మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. సీనియర్ హీరోయిన్ కుష్భూకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి.. ‘నిన్ను రేప్ చేసి చంపేస్తాం’ అని బెదిరించాడట. ఈ విషయాన్ని కుష్బూనే తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

తనకు ఫోన్ చేసిన వ్యక్తి ఫోన్ నెంబర్ ను షేర్ చెయ్యడంతో పాటు… పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని కూడా ట్యాగ్ చేసి… ‘దీదీ… నాలాంటి వ్యక్తులకే బెదిరింపులు ఎదురవుతున్నాయంటే… ఇతర మహిళల పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి’ అంటూ పేర్కొంది.

Most Recommended Video

ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus