ఈ ఫిబ్రవరి 14న అందరూ వాలెంటైన్స్ డే వేడుకను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.. సెలబ్రిటీలు కూడా తమ ప్రియమైన వారికి ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తమ జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తులకు ప్రేమ పూర్వక విషెస్ చెప్తూ.. వారితో తీసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్టులు చేస్తున్నారు.. నటి లయ కూడా వాలంటైన్స్ డే ని తన కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు. పెళ్లి తర్వాత అమెరికాలో భర్త, ఇద్దరు పిల్లలతో ఉంటున్న లయ..
అక్కడ మన తెలుగు పండుగలన్నిటినీ సెలబ్రేట్ చేస్తుంటారు. సామాజిక మాధ్యమాల ద్వారా అందుకు సంబంధించిన హంగామా అంతటిని షేర్ చేసుకుంటుంటారు. వాలంటైన్స్ డే అకేషన్ కాబట్టి కూతురుతో పాటు తను కూడా రెడ్ డ్రెస్ వేసుకుని మెరిసిపోయారు లయ.. అందరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ లయ పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘‘క్యూట్ ఫ్యామిలీ.. హ్యాపీ వాలంటైన్స్ డే’’ అంటూ ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.