Vedha Review in Telugu: వేద సినిమా రివ్యూ & రేటింగ్!
March 31, 2023 / 04:59 PM IST
|Follow Us
|
Join Us
Cast & Crew
శివ రాజ్‌కుమార్ (Hero)
గణవి లక్ష్మణ్ (Heroine)
భరత్ సాగర్ , శ్వేతా చెంగప్ప (Cast)
హర్ష (Director)
గీతా శివరాజ్‌కుమార్ (Producer)
అర్జున్ జన్య (Music)
స్వామి జె.గౌడ (Cinematography)
Release Date : ఫిబ్రవరి 10, 2023
కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ నటించిన 125వ చిత్రంగా విడుదలైన “వేద” కర్ణాటకలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. యాక్షన్ సినిమా కావడంతో తెలుగులోనూ వర్కవుటవుతుంది అనే ఆలోచనతో.. అదే పేరుతో తెలుగులో అనువాద రూపంలో విడుదల చేశారు. మరి ఈ రివెంజ్ యాక్షన్ డ్రామా తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ: శిర్లి అనే గ్రామంలో తన భార్య పిల్లలతో సంతోషంగా జీవిస్తుంటాడు వేద. కానీ ఓ గ్యాంగ్ కారణంగా వాళ్ళ కలలన్నీ చెల్లాచెదురవుతాయి. దాంతో వేద (శివరాజ్ కుమార్) మరియు అతని కుమార్తె కనక (అదితి సాగర్) అత్యంత దారుణంగా కొందర్ని చంపుతుంటారు.
అసలు ఆ గ్యాంగ్ ఎవరు? వేద కుటుంబాన్ని, ఊరుని ఎందుకు టార్గెట్ చేశారు? వేద వాళ్ళ మీద ఏ విధంగా పగ తీర్చుకున్నాడు? అనేది “వేద” సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: హీరో శివరాజ్ కుమార్ తన సీనియారిటీ ప్రూవ్ చేసుకున్నారు. ఆయన వయసుకి కాస్త కష్టమైనప్పటికీ.. ఎంతో నేర్పుతో చేసిన యాక్షన్ స్టంట్స్ మాస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటాయి.
అందరికంటే ఎక్కువగా ఆకట్టుకున్న నటి గనవి లక్ష్మణ్, పల్లెటూరి పిల్లగా ఎంత అందంగా కనిపించిందో.. యాక్షన్ బ్లాక్స్ లో అంతే క్రూరంగా నటించి గగుర్పాటుకు గురి చేసింది. కూతురు పాత్రలో నటించిన అదితి సాగర్ కూడా అదరగొట్టింది.
మిగతా ప్యాడింగ్ ఆర్టిస్టులందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు: అర్జున్ జన్య నేపధ్య సంగీతం బాగుంది. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్ ను బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేసిన తీరు ప్రేక్షకుల్ని సినిమాలోకి లీనమయ్యేలా చేసింది. పాటలు తెలుగు నేటివిటీకి సింక్ అవ్వలేకపోయాయి, అలాగే.. సాహిత్యం పరంగానూ గొప్పగా లేవు.
స్వామి జె.గౌడ సినిమాటోగ్రఫీ వర్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిజానికి చాలా సాధారణమైన కథను.. కేవలం తన కెమెరా వర్క్ తోనే ఎలివేట్ చేశాడు స్వామి.
ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ టీం ను ఎంత పొగిడినా తక్కువే. వాళ్ళ అద్భుతమైన వర్క్ వల్లే.. పీరియడ్ డ్రామాలో ఎక్కడా అసహజత్వం కనిపించలేదు.
దర్శకుడు హర్ష, కథ కంటే కథనం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. అందువల్ల సినిమాలో కాస్త ఢీలా పడే సందర్భం వచ్చినప్పుడల్లా ఎమోషనల్ లేదా యాక్షన్ బ్లాక్ యాడ్ చేసి ఆడియన్స్ ను బోర్ ఫీలవ్వకుండా చేశాడు. కథకుడిగా కంటే దర్శకుడిగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు హర్ష.
విశ్లేషణ: కథ గురించి ఎక్కువగా పట్టించుకోకుండా.. యాక్షన్ బ్లాక్స్ & ఎమోషనల్ సీన్స్ ను ఎంజాయ్ చేయగలిగితే థియేటర్లో ఒకసారి చూడదగ్గ చిత్రం “వేద”. అయితే.. రేపు ఒటీటీలో విడుదలవుతున్న ఈ చిత్రం థియేటర్లలో ఏమేరకు కలెక్షన్ రాబడుతుందో చూడాలి.