Meera Jasmine: ఒక్కప్పటి స్టార్ హీరోయిన్ మీరా జాస్మిన్ ఇప్పుడెలా ఉందో చూడండి..!

కెరీర్ ప్రారంభంలో పలు తమిళ సినిమాల్లో నటించిన మీరా జాస్మిన్.. అటు తర్వాత శివాజీ హీరోగా నటించిన ‘అమ్మాయే బాగుంది’ చిత్రంతో టాలీవుడ్ కు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే హిట్ అందుకోవడం.. పైగా పెర్ఫార్మన్స్ తో కూడా ఈమె ఆకట్టుకోవడంతో పవన్ కళ్యాణ్ ‘గుడుంబా శంకర్’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. నిజానికి ఈ సినిమాకి ముందుగా భూమికని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఆమె ఈ ప్రాజెక్టు చేయలేకపోయింది.

దాంతో మీరా జాస్మిన్ ను ఫైనల్ చేసాడు దర్శకుడు వీర శంకర్. ఈ చిత్రంలో మీరా జాస్మిన్ లుక్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఆ మూవీ తర్వాత మీరా జాస్మిన్ కు టాలీవుడ్లో మంచి అవకాశాలు వచ్చాయి. తర్వాత ఈమె ‘భద్ర’ ‘రారాజు’ ‘ఆకాశ రామన్న’ ‘అ ఆ ఇ ఈ’ ‘బంగారు బాబు’ ‘మా ఆయన చంటి పిల్లాడు’ ‘పందెం కోడి’ ‘గోరింటాకు’ ‘యమగోల మళ్ళీ మొదలైంది’ ‘మహారధి’ వంటి చిత్రాల్లో నటించింది.అటు తర్వాత ఈమె తెలుగు సినిమాల్లో కనిపించలేదు.

సంగీత విద్వాంసుడు మాండోలిన్ రాజేష్ తో కొన్నాళ్ళు ప్రేమాయణం నడిపింది ఈ అమ్మడు.అయితే అనూహ్యంగా ఈమె దుబాయ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్‌ ను 2014 ఫిబ్రవరి 12న వివాహం చేసుకుని సెటిల్ అయ్యింది. ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.ఆ ఫొటోల్లో ఈమె లుక్ ను చూసి జనాలు షాక్ అవుతున్నారు. అప్పటికీ.. ఇప్పటికీ ఈమె లుక్ లో చాలా మార్పులు వచ్చాయి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus