‘పెళ్ళి గురించి నాకెందుకు’…. అంటున్న నగ్మా..!

  • March 5, 2019 / 06:34 PM IST

అప్పట్లో టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించింది నగ్మా. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్ ఇలా అందరి హీరోలతోనూ ఆడి పాడింది నగ్మా. టాలీవుడ్ తో పాటూ కోలీవుడ్,బాలీవుడ్ లో కూడా అగ్రహీరోలందరితో నటించి సక్సెస్ ఫుల్ నటిగా సంపాదించుకుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్రను పోషిస్తున్న నగ్మా వయసు 45 ఏళ్ళు. అయినప్పటికీ ఇంకా పెళ్ళి చేసుకోకపోవడం గమనార్హం.

అయితే ఇటీవల పాల్గొన్న నగ్మా కి… ‘మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకోబోతున్నారు’? అనే ప్రశ్న ఎదురయ్యింది. దీనికి కాస్త డిఫరెంట్ గా సమాధానమిచ్చింది నగ్మా. ఈ ప్రశ్నకి నగ్మా సమాధానమిస్తూ… “పెళ్ళి ఎప్పుడు జరగాలని రాసిపెట్టి ఉంటే అప్పుడే జరుగుతుంది. ఎవరికైనా పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది? అసలు జరుగుతుందా? లేదా? అనే విషయాన్ని దేవుడు ముందే రాసి పెడతాడు. దాన్ని నేను డిసైడ్ చేయలేను.అలా పెళ్ళికి నేను వ్యతిరేకం కాదు” అంటూ తెలిపింది నగ్మా.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus