టాలీవుడ్ తో పాటూ బాలీవుడ్ లో సైతం అందరి స్టార్ హీరోలతోనూ నటించి అప్పట్లో ఓ ఊపు ఊపేసింది నగ్మా. అప్పట్లో నగ్మా హీరోయిన్ గా నటిస్తుంది అంటే ఆ చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడేది. అప్పట్లో ఈ భామ అందాల ప్రదర్శన ఆ రేంజ్లో ఉండేది మరి. ఇక తన చెల్లెల్లిద్దరికీ పెళ్ళయినప్పప్పటికీ… నగ్మా మాత్రం పెళ్ళి చేసుకోకుండా ఒంటరిగానే మిగిలిపోయింది. అయితే పెళ్ళికి తానేమీ వ్యతిరేకం కాదని నగ్మా చెప్పుకొచ్చింది. తనకి నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు ఎప్పుడైనా పెళ్ళి చేసుకుంటానని తెలిపింది. ఎవరికి ఎప్పుడు పెళ్ళవ్వాలి అనేది దేవుడు నిర్ణయిస్తాడని… మనం పాలనా టైంకి పెళ్ళి చేసుంకుందాం అని అనుకున్నంత మాత్రాన పెళ్ళిళ్ళు జరిగిపోవని నగ్మా తెలిపింది.
ఇక గతంలో నగ్మా.. ఒకప్పటి టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీతో ప్రేమాయణం నడిపించిందనే టాక్ ఓ రేంజ్లో నడిచింది. అంతే కాదు వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఇక ఈ విషయం పై తాజాగా క్లారిటీ ఇచ్చింది నగ్మా.. ‘‘గంగూలీ.. నేను ప్రేమించుకున్న సంగతి నిజమే. మేమిద్దరం పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాం . అయితే నా వల్ల తన కెరీర్ కి ఇబ్బంది కలగకూడదని తప్పుకున్నాను. మా ఇద్దరి కెరీర్స్ పీక్స్ లో ఉన్నప్పుడు… ఈ విషయం వల్ల దెబ్బతిన కూడదనే ఉద్దేశంతోనే విడిపోయాం. మాకు ప్రేమకు మించిన బాధ్యతలు అప్పుడు చాలా ఉన్నాయి. ఇక విడిపోవడం తప్ప వేరే మార్గం కనిపించలేదు’’ అంటూ ఆసక్తికరమైన విషయాల్ని తెలియజేసింది నగ్మా.