Nidhhi Agerwal: అనవసరంగా ఆ ఫోటోని ఎందుకు షేర్ చేస్తున్నారు : నిధి అగర్వాల్

నిధి అగర్వాల్ ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుంది. పూజా హెగ్డే, రష్మిక వంటి భామల పోటీని తట్టుకుంటూ నెట్టుకొస్తోంది. వాళ్ళతో సరిసమానంగా గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటుంది. సోషల్ మీడియాలో ఈమె ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిన సంగతే. ఈమె సోషల్ మీడియా ఖాతాలకు ఫాలోవర్స్ సంఖ్య కూడా ఎక్కువే.! అందాల ఆరబోతకు ఈమె అస్సలు తగ్గదు. మొన్నామధ్య ఆమె బాత్రూంలో తీసుకున్న సెల్ఫీలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల నిధి కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

ఎద అందాలను చూపిస్తూ కుర్రకారుని ఆకర్షించే ప్రయత్నాలు చేసింది. ఈ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అయితే ఆ ఫోటోల గురించో.. కాదో తెలీదు కానీ.. తాజాగా నిధి అగర్వాల్ నెటిజెన్ల పై ఫైర్ అవుతూ తన ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ..”నాకు సంబంధించిన ఓ ఫోటో అవసరం లేకపోయినా కూడా ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది.నిజానికి దానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్ధం కావడం లేదు. ఎవ్వరైనా సరే మీ వరకు ఆ ఫోటోలు వస్తే.. వాటిని షేర్ చేయకండి.

అలాంటి చీప్ థ్రిల్స్ మానుకోండి. అంతలా దిగజారిపోకండి” అంటూ ఘాటుగా తన ఇన్స్టా స్టోరీ ద్వారా స్పందించింది నిధి అగర్వాల్. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’, అశోక్ గల్లా హీరోగా తెరకెక్కుతున్న ‘హీరో’ వంటి చిత్రాల్లో నటిస్తుంది.

1

2

3


Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus