ఆందోళన లో కోలీవుడ్ సినీ ప్రియులు..!

Advertisement

పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్.జె.సూర్య డైరెక్షన్లో వచ్చిన ‘కొమరం పులి’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమయ్యింది నికిషా పటేల్. ఈ చిత్రం తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ‘ఓం 3డి’ చిత్రంలో కూడా ఓ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు కూడా పెద్ద డిజాస్టర్లుగా మిగిలాయి. దీంతో ఆఫర్లేమీ రాకపోవడంతో కోలివుడ్ కి చెక్కేసింది ఈ భామ. అక్కడ ‘తలైవన్‌’, ‘కరైయోరం’, ‘నారదన్‌’, ‘భాస్కర్‌ ఒరు రాస్కెల్’ వంటి చిత్రాల్లో నటించి అక్కడి ప్రేక్షకులను మెప్పించింది.

ఇక నికీషా పటేల్ ప్రస్తుతం జీవీ ప్రకాష్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో నటిస్తుంది. ఎలిల్ ఈ చిత్ర దర్శకుడు. ఇదిలా ఉండగా నికిషా పటేల్ కి రహస్యంగా ఆపరేషన్ జరిగిందని, ఎవరికీ తెలియనివ్వకుండా ముంబైలో సైలెంట్ గా ఆపరేషన్ కానిచ్చేశారని గత మూడు రోజులుగా టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ విషయం పై ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో కోలీవుడ్ ప్రేక్షకుల్లో ఆందోళన నెలకొంది. అయితే తాజాగా ఈ విషయం పై నికిషా పటేల్ క్లారిటీ ఇచ్చింది. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా నికిషా పటేల్ స్పందిస్తూ… “నాకు ఆపరేషన్ జరిగిన మాట నిజమే…! అయితే అది చిన్న సర్జరీనే .. ప్రస్తుతం అంతా బాగానే ఉంది” అంటూ తెలిపింది. దీంతో కోలీవుడ్ ప్రేక్షకులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. త్వరగా కోలుకోవాలని కామెంట్లు కూడా పెడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus