Poonam Kaur: బాలయ్య చిన్నల్లుడిపై పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ చూస్తే షాకవ్వాల్సిందే!

సోషల్ మీడియా వేదికగా పూనమ్ కౌర్ (Poonam Kaur) ఏ ట్వీట్ చేసినా ఆ ట్వీట్ సంచలనం అవుతుందనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పూనమ్ కౌర్ ట్వీట్లు మరింత హాట్ టాపిక్ అవుతున్నాయి. బాలయ్య (Balakrishna) చిన్నల్లుడి గురించి ప్రస్తావిస్తూ పూనమ్ ట్వీట్ చేయడం గమనార్హం. బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ వైజాగ్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఓటమిపాలైన శ్రీ భరత్ ఈ ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా విజయం సాధిస్తానని నమ్మకంతో ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సినారియో చూస్తుంటే ఈ ఎన్నికల్లో శ్రీ భరత్ ఏదో సాధించేలా కనిపిస్తున్నాడని పూనమ్ కౌర్ పేర్కొన్నారు. వైజాగ్ నుంచి శ్రీభరత్ ఎంపీగా గెలిచి పార్లమెంట్ కు వెళ్తే అద్భుతంగా ఉంటుందని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చారు. చదువు గురించి భవిష్యత్ గురించి శ్రీభరత్ కు ఉన్న అవగాహన ఒక రాష్ట్రానికే పరిమితం కాకూడదని పూనమ్ కౌర్ తెలిపారు. అయితే ఎవరూ ఊహించని విధంగా పూనమ్ కౌర్ నుంచి బాలయ్య చిన్నల్లుడికి సపోర్ట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.

ఆమె సపోర్ట్ శ్రీ భరత్ కు ప్లస్ అవుతుందేమో చూడాలి. ఇది స్పాన్సర్డ్ ట్వీట్ కాదని ఆమె ట్వీట్ లో పేర్కొనడం కొసమెరుపు. పూనమ్ కౌర్ రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలపై మరింత ఫోకస్ పెడతారేమో చూడాల్సి ఉంది. అయితే పూనమ్ ట్వీట్ గురించి నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పూనమ్ కౌర్ రాజకీయాలకు దూరంగా ఉంటే బెటర్ అని మరి కొందరు సూచనలు చేస్తున్నారు. సినీ సెలబ్రిటీలు ఎవరికి సపోర్ట్ చేసినా మరో పార్టీ నుంచి విమర్శలు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పూనమ్ కౌర్ సినిమాలతో మళ్లీ బిజీ అయితే బాగుంటుందని కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus