సీనియర్ నటి ప్రగతి అందరికీ సుపరిచితమే. గతంలో పలు తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఆమె.. సరైన సక్సెస్ రాకపోవడంతో మళ్ళీ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటిస్తూ వస్తుంది. మహేష్ బాబు, దర్శకుడు శోభన్ కాంబినేషన్లో వచ్చిన ‘బాబీ’ చిత్రంతో ప్రగతి రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈమె వరుస సినిమాల్లో నటిస్తూ వచ్చింది. అయితే ఈమెలో మంచి కమెడియన్ ఉంది అని ప్రూవ్ చేసింది ‘దూకుడు’ ‘ఎఫ్ 2 ‘ ‘బాద్ షా’ ‘ఎఫ్ 3 ‘ వంటి సినిమాలు అనే చెప్పాలి.
ఇక 2020 లాక్ డౌన్ టైంలో ప్రగతిలోని కొత్త యాంగిల్ బయటపెట్టిన సంగతి తెలిసిందే.అప్పటి నుండి ఈమె ఇమేజ్ కూడా మారింది అని చెప్పాలి. సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ప్రగతి పర్సనల్ లైఫ్ కూడా చాలా మందికి తెలిసిందే. ఆమె గతంలో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని.. తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయింది.
ప్రస్తుతం తన కొడుకు, కూతురితో (Pragathi) ఈమె సింగిల్ మదర్ గా జీవిస్తుంది. అయితే ఈమె రెండో పెళ్లి చేసుకుంటుంది అంటూ గతంలో ప్రచారం జరిగింది. కానీ ఈసారి మాత్రం.. ప్రగతి ఓ స్టార్ ప్రొడ్యూసర్ ని రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది అంటూ మళ్ళీ ప్రచారం మొదలైంది. దీనిపై ఆమెను ఆరా తీయగా.. ‘నా రెండో పెళ్ళికి నన్ను పిలవడం మాత్రం మర్చిపోవద్దు అని చెప్పండి’ అంటూ సమాధానం ఇచ్చింది