సోషల్ మీడియా కారణంగా సెలబ్రిటీలకు, సామాన్యులకు మధ్య దూరం తగ్గిపోయిందనే సంగతి కొత్తగా చెప్పక్కర్లేదు.. ఒకప్పుడు తమ నటనతో ప్రేక్షకాభిమానులను ఆకట్టుకున్న సీనియర్ నటీనటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు.. ఇప్పుడు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలలో తమ పర్సనల్ విషయాలన్నిటినీ షేర్ చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటున్నారు.. మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను పెంచుకుంటున్నారు.. వారిలో ఒకప్పుడు యూత్ ఫేవరెట్ హీరోయిన్గా టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన ముంబై ముద్దుగుమ్మ ప్రీతి జింగానియా కూడా ఒకరు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘తమ్ముడు’ సినిమాతో ఆమెకు బ్రేక్ వచ్చింది.. ‘నరసింహ నాయుడు’, ‘యమదొంగ’ (స్పెషల్ సాంగ్) చేసి అలరించింది.. హిందీ, కన్నడ, ఉర్దూ, పంజాబీ భాషల్లోనూ యాక్ట్ చేసింది. 2008లో పెళ్లి చేసుకున్న ప్రీతి కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది కానీ సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటుంది. ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరని గ్లామర్‌తో కనిపిస్తోంది..
ఇటీవల తన ఇన్‌స్టాలో ఎక్కువగా స్విమ్మింగ్‌పూల్‌లో ఉన్న పిక్స్, వీడియోస్ షేర్ చేస్తుంది.. అవి చూసిన నెటిజన్లు ‘42 ఏళ్ల వయసులోనూ నాజూకు తగ్గలేదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..