Butterfly Review: బటర్ ఫ్లై సినిమా రివ్యూ & రేటింగ్!
December 29, 2022 / 05:00 PM IST
|Follow Us
|
Join Us
Cast & Crew
నిహాల్ (Hero)
అనుపమ పరమేశ్వరన్ (Heroine)
భూమిక, రావు రమేష్ తదితరులు.. (Cast)
ఘంటా సతీష్ బాబు (Director)
రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్ళూరి, ప్రదీప్ నల్లమెల్లి (Producer)
అర్వీజ్ - గిడియన్ కట్ట (Music)
సమీర్ రెడ్డి (Cinematography)
Release Date : డిసెంబర్ 29, 2022
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్ “బటర్ ఫ్లై”. “కార్తికేయ 2, 18 పేజస్” విజయాలతో మాంచి ఫామ్ లో ఉన్న అనుపమ నటించిన సినిమా కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. హాట్ స్టార్ యాప్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ: అనాధలుగా కలిసి పెరుగుతారు గీత (అనుపమ పరమేశ్వరన్), వైజయంతి (భూమిక). అక్కలో అమ్మను చూసుకుంటుంది గీత. వైజయంతి ఇద్దరు పిల్లలు కనిపించకుండాపోవడంతో ఏం చేయాలో పాలుపోక, కన్ఫ్యూజన్ లో చాలా టెన్షన్ పడుతూ.. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఆ పిల్లలను కిడ్నాపర్ల నుంచి కాపాడడానికి విశ్వప్రయత్నం చేస్తుంటుంది. అసలు పిల్లల్ని కిడ్నాప్ చేసింది ఎవరు? గీత వాళ్ళను ఎలా కాపాడగలిగింది? వంటి ప్రశ్నలకు సమాధానమే “బటర్ ఫ్లై”.
నటీనటుల పనితీరు: అనుపమ పరమేశ్వరన్ మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. సహాయం కోసం శరణార్ధురాలిగా తిరిగే సన్నివేశాల్లో ఆమె ఎమోషనల్ యాక్టింగ్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. తక్కువ స్క్రీన్ టైమ్ లో భూమిక తన పాత్రకు న్యాయం చేసింది. రావురమేష్, నిహాల్ లు తమ తమ పాత్రల్లో పర్వాలేదనిపించుకున్నారు. నెగిటివ్ రోల్స్ ప్లే చేసినవాళ్ళందరూ ఆకట్టుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు ఘంటా సతీష్ బాబు రాసుకున్న కథ బాగుంది కానీ.. నడిపించిన విధానం పూర్తిస్థాయిలో ఆకట్టుకునే స్థాయిలో లేదు. అవసరం కోసం వచ్చిన ఆడపిల్లను సమాజం ఎలా చూస్తుంది అనే అంశాన్ని ఎలివేట్ చేసిన తీరులో నిజాయితీ ఉంది. అయితే.. ఈ తరహా థ్రిల్లర్స్ కు చాలా కీలకమైన ట్రైలర్ కట్ విషయంలో సరైన జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల సినిమా మొదట్లోనే విలన్ ఎవరు అనేది తెలిసిపోతుంది.
అలాగే.. పాండవుల వనవాసం కాన్సెక్ట్ ను విలన్ గ్యాంగ్ కు ఆడాప్ట్ చేసిన విధానం బాగున్నా, దాన్ని అర్ధవంతంగా తీర్చిదిద్దడంలో పూర్తిస్థాయి విజయం సాధించలేకపోయాడు. సో, సతీష్ దర్శకుడిగా, కథకుడిగా బొటాబోటి మార్కులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ మాత్రం సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి. నేపధ్య సంగీతం విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది.
విశ్లేషణ: కిడ్నాపింగ్ డ్రామాస్ కి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను సమపాళ్లలో మ్యానేజ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. అనుపమ నటన కోసం “బటర్ ఫ్లై”ను ఒటీటీలో ఒకసారి చూడొచ్చు. కాకపోతే.. స్క్రీన్ ప్లే ఇంకాస్త బెటర్ గా రాసుకొని ఉంటే మంచి థ్రిల్లర్ గా నిలిచేది.