నో..ఎస్.. చెప్పడం మన చేతుల్లోనే ఉంటుంది : ప్రియ

  • August 27, 2018 / 07:48 AM IST

ప్రతి సందర్భాన్ని సంతోషంగా మలుచుకోవాలా? విచారణలో కుంగిపోవాలా? అనేది మన చేతుల్లోనే ఉంటుందని మానసిక విశ్లేషకులు చెబుతుంటారు. అందులో నిజం లేకపోలేదు. అలాగే ఇతరులు మనతో ఎలా ప్రవర్తించాలో అనేది కూడా మనచేతుల్లోనే ఉంది. ఈ విషయాలను గుర్తుపెట్టుకుంటే చాలని, అనేక సమస్యలు తొలిగిపోతాయని ప్రియ భవాని శంకర్ చెప్పారు. న్యూస్ రీడర్ గా, హోస్ట్ గా, సీరియల్ నటిగా ఒక్కో మెట్టు ఎదుగుతూ ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్ గా చేస్తున్న ఈ తమిళనటి క్యాస్టింగ్ కౌచ్ పై విభిన్నంగా స్పందించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. “సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు నిజమే.

ఈ వేధింపులు అన్ని రంగాల్లో ఉన్నాయి. అయితే, వాటిని అంగీకరించడం, నిరాకరించడం మన చేతుల్లోనే ఉంటుంది. లైంగిక వేధింపుల గురించి శ్రీరెడ్డి బహిరంగంగా చెప్పడం సరికాదు. తప్పు చేసి, బయటకు చెప్పుకోవడం ఎంత వరకు కరక్ట్. వేధింపుల బారిన పడకూడదనుకుంటే నటన నుంచి తప్పుకోవచ్చు” అని శ్రీ రెడ్డి కి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం కార్తీకి జంటగా నటిస్తున్న ఈమె.. కుటుంబ చిత్రాల్లో నటిస్తానని వెల్లడించారు. త్వరలోనే మంచి కథతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్నట్టు తెలిపారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus