Bigg Boss 5 Telugu: రవి – లహరిలపై నింద వేసిన ప్రియ..!

  • September 21, 2021 / 10:02 AM IST

బిగ్ బాస్ హౌస్ లో చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించేవి నామినేషన్స్ మాత్రమే. ఆ తర్వాత ఆదివారం ఎలిమినేషన్ అనేది కూాడ హౌస్ మేట్స్ లో ఉత్కంఠని రేకెత్తిస్తుంది. అయితే, ఈసారి మూడోవారం నామినేషన్స్ లో భాగంగా హౌస్ లో పెద్ద రచ్చే జరిగింది. ఆర్టిస్ట్ ప్రియ లహరి అండ్ రవిలపై పెద్ద నిందవేసింది. ఫస్ట్ లహరి ప్రియని నామినేషన్స చేస్తూ మీకు నాకు మద్యలో అసలు డిస్టాన్స్ ఎందుకు వచ్చిందో తెలియలేదని అందుకే నామినేట్ చేస్తున్నాను అంటూ చెప్పింది. ఇక్కడే నువ్వు సేఫ్ గేమ్ ఆడకు. నువ్వు వేరే మగాళ్లతో బిజిగా ఉన్నావ్ అంటూ దెబ్బిపొడిచింది ప్రియ.

ఆర్గ్యూమెంట్ ఇక్కడ్నుంచే మొదలైంది. ఆ తర్వాత ప్రియ లహరిని నామినేట్ చేస్తూ మనిద్దరి మద్యలో డిస్టాన్స్ వచ్చిందని, రెండురోజుల్నించీ నువ్వు నా దగ్గర గిల్డ్ ఫీల్ అవుతున్నావ్ అని చెప్పింది. అంతేకాదు నువ్వు రవిని వాష్ రూమ్ దగ్గర మిడ్ నైట్ హగ్ చేస్కోవడం నేను కళ్లారా చూశాను అంటూ నిందవేసింది. మేబీ అది ఫ్రెండ్లీ హగ్ కూడా కావచ్చు ఉంటూ చెప్పింది. కానీ, రవి అండ్ లహరి ఇద్దరూ కూడా ప్రియపై విరుచుకుపడ్డారు.

అంతేకాదు, రవి ఇక్కడ హగ్ ఇచ్చుకోకూడదు అని రూల్ ఏమైనా ఉందా అంటూ మాట్లాడాడు. నిజానికి అంతకుముందే రవి అండ్ ప్రియ ఇద్దరూ కూడా లహరి గురించే మాట్లాడుకున్నారు. ఇదే విషయాన్ని ప్రియ చెప్పే ప్రయత్నం చేసింది. కానీ హగ్ గురించి మాట్లాడేసరికి సీన్ మొత్తం రాంగ్ అయిపోయింది. ఆ తర్వాత ప్రియా సన్నీని నామినేట్ చేస్తున్నప్పుడు కూడా మళ్లీ ఈటాపిక్ వచ్చింది.

సన్నీ అలా ఎలా మాట్లాడతారు మీరు హగ్ ని రాంగ్ గా ప్రొజెక్ట్ చేస్తూ అంటూ రెచ్చిపోయాడు. దీంతో బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ అనేవి హీటెక్కిపోయాయి. అందరి అటెన్షన్ ఒక్కసారిగా ప్రియ అండ్ లహరిలపైకి వెళ్లాయి. దీంతో మూడోవారం నామినేషన్స్ పూర్తి అవ్వలేదు. హౌస్ లో మిగిలిన కొందరు నామినేషన్స్ ని మరోరోజూ పూర్తి చేయబోతున్నారు. మొత్తానికి అదీమేటర్.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus