పదేళ్ల పాటు సినీ ఇండస్ట్రీని ఏలేసిన రాశి గురించి పరిచయం అక్కర్లేదు. ఆ రోజుల్లో తన అందాలతో కుర్రకారు గుండెళ్లో నిలిచిపోయిన అమ్మడు పెళ్లి చేసుకుని సినీ పరిశ్రమకు కాస్త గాప్ ఇచ్చింది. ఇప్పటికీ రాశి అంటే పడి చచ్చే ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. పెళ్లి తర్వాత కూడా అటు బుల్లితెర, ఇటు వెండితెరపై అడపాదడపా కనిపిస్తున్నారు. ఇప్పటికీ తాను హీరోయిన్ లా చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. తన జీవితం రాశి ఎన్నో తప్పులు చేసింది. వీటన్నింటినీ మర్చిపోయి తన పేరెంట్స్ ఆమెను చేరదీశారు.
బాల నటిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి పవన్ కళ్యాణ్ సరసన గోకులం సీత సినిమాతో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. తర్వాత కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోలందరి సరసన చేసింది. అలాంటి రాశి తన తండ్రి మరణించిన సమయంలో నవ్విందట. రాశినే స్వయంగా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అదేంటి నాన్న చనిపోతే ఎవరైనా ఏడుస్తారు.. రాశి ఎందుకలా చేసిందని ఆశ్చర్యపోతున్నారా… నిజం తెలిస్తే మీకు కన్నీళ్లు ఆగవు. అసలు విషయం ఏమిటంటే..
కమెడియన్ అలీ హోస్టింగ్ చేస్తున్న అలీ తో సరదగా అనే టీవీ షోకు (Actress) రాశి గెస్ట్ గా వచ్చింది. ఈ షోలో తన గురించి ఎన్నో విషయాలు పంచుకుంది. అందులో భాగంగా రాశి ఓ విషయంపై మాట్లాడుతూ.. ‘నా పుట్టిన రోజు నాడు నేను సీనియర్ యాక్టర్ విజయకాంత్ తో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రతి బర్త్ డే కు మా నాన్న రాత్రి 12గంటలకు ఫోన్ చేసి విషెష్ చెబుతారు. కానీ ఆ రోజు మాత్రం నాకు ఫోన్ రాలేదు. అప్పటికే నాలో ఏదో ఆందోళన మొదలైంది.
ఇక తర్వాత యూనిట్ వాళ్లు బర్త్ డే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. ఈ లోగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చే టైంలో ఫోన్ వచ్చింది. మా డ్రైవర్ ఫోన్ చేశాడు. నాన్నే చేశాడనుకుని ఆత్రుతగా ఫోన్ ఎత్తాను. డ్రైవర్ వెంటనే అన్నయ్యకి ఫోన్ ఇవ్వమని కోరడంతో ఇచ్చేశాను. డ్రైవర్ అన్నయ్యకు నాన్న చనిపోయారు అని చెప్పాడు. అన్నయ్య నాకు నాన్న చనిపోయిన విషయం ఎలా చెప్పాలో తెలియక..
భయం భయంగానే డాడీ చనిపోయారంట అని చెప్పారు. ఆ విషయం విన్న వెంటనే ఏం విన్నానో అర్థం కాక మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి గట్టిగా నవ్వేశాను.. కాసేపటికి తేరుకుని బాధతో ఏడ్చడం మొదలు పెట్టాను. నా పుట్టిన రోజు నాడే నాన్న చనిపోవడంతో బర్త్ డే అంటే ఇష్టం ఉండదు.’ అంటూ తన ఆవేదననంతా బయట పెట్టింది.
ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!
‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?