సీనియర్ సినీనటి రాధా కుమార్తె కార్తిక పెళ్లి బంధం లోకి అడుగుపెట్టారు. నటుడు నాగచైతన్యతో పాటు ఈమె కూడా ఇండస్ట్రీకి జోష్ సినిమా ద్వారా హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు. హీరోయిన్గా పలు సినిమాలలో నటించిన కార్తీక ఇండస్ట్రీలో మాత్రం పెద్దగా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. ఇలా హీరోయిన్ గా ఈమె సక్సెస్ కాకపోవడంతో వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. కార్తిక వ్యాపార రంగంలో మాత్రం ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
దుబాయ్ లో ఉన్నటువంటి బిజినెస్ లు అన్నింటినీ కూడా ఈమె ఎంతో చక్కగా ముందుకు నడుపుతూ తన బిజినెస్ లను విస్తరింప చేశారు. ఇక ఈమె రోహిత్ మీనన్ అనే వ్యక్తిని గత కొద్ది రోజుల క్రితం నిశ్చితార్థం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే ఇలా తన నిశ్చితార్థపు ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఫోటోలను షేర్ చేసిన ఈమె ఆవ్యక్తి ఫేస్ కనపడకుండా జాగ్రత్త పడ్డారు.
అనంతరం తనకు కాబోయే భర్తను కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా అందరికీ పరిచయం చేశారు. ఇక తాజాగా కేరళలోని త్రివేండ్రంలో ఈమె వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు కోలీవుడ్ స్టార్స్ మాత్రమే కాకుండా అలనాటి టాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా హాజరయ్యారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ పెళ్లి వేడుకలలో సందడి చేశారు.
ఒకప్పుడు సినిమాలలో నటించిన హీరో హీరోయిన్స్ అందరూ కూడా ఈ పెళ్లి వేడుకలలో కలవడంతో సందడిగా మారింది. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారడంతో అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈమె (Karthika Nair) పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!