Actress Radhika: ఘనంగా రాధికా 60 వ పుట్టినరోజు..పార్టీలో సందడి చేసిన సెలబ్రిటీస్!

Advertisement

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అన్ని భాషలలోనూ అగ్ర హీరోలందరి సరసన నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాధిక గురించి పరిచయం అవసరం లేదు. ఈమె తెలుగులో కూడా స్టార్ హీరోలు అందరి సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా రాధిక కేవలం సినిమాలు మాత్రమే కాకుండా సీరియల్స్ లో కూడా నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను సందడి చేశారు.

ఇదిలా ఉండగా ఆగస్టు 21వ తేదీ రాధిక తన 60 వ పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.నేడు తన 60వ పుట్టినరోజు అని తెలియడంతో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున అభిమానులు ఈమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే తన ఫ్యామిలీ మెంబర్స్ తనకు మిడ్ నైట్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరపగా పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు తన బర్త్ డే కి హాజరై సందడి చేశారు.

రాధిక 60వ పుట్టినరోజు వేడుకలలో భాగంగా తన స్నేహితులు ఇతర నటీమణులు రమ్యకృష్ణ, మీనా, కుష్బూ వంటి తదితర హీరోయిన్లు ఈ పార్టీకి హాజరయ్యి తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా మొదటిసారి ఈమె పుట్టినరోజు వేడుకలకు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన భార్య జ్యోతికతో కలిసి హాజరయ్యారు. ఇలా రాధిక పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున సెలబ్రిటీలు హాజరు కావడంతో ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో గుర్తింపు పొందిన రాధిక తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికీ ఈమె పలువురు యంగ్ హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా సినిమాలతో బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు. ఈ క్రమంలోనే తన బర్త్ డే పార్టీకి సంబంధించిన ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1

2

3

4

5

6

7

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus