రకుల్ గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హావ నడుస్తోంది. ఈ ఏడాది ఆమె నటించిన తెలుగు చిత్రాలు నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ హ్యాట్రిక్ సాధించడంతో టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. అంతేకాకుండా ఆమె ఉంటే హిట్ గ్యారంటీ అనే సెంటిమెంట్ తో హీరోలు ఈ బ్యూటీ తో నటించాలని ఆశపడుతున్నారు. ప్రస్తుతం రకుల్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ద్విభాషా చిత్రంలో నటిస్తోంది. సాయి ధరమ్ తేజ్ తో విన్నర్ మూవీలోనూ అథ్లెట్ గా కనిపించనుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగ ఛైతన్యతో కలిసి పని చేస్తోంది. అతి తక్కువకాలంలో భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ గురించి ఎవరికీ తెలియని సంగతులు ..

పేరులో ప్రేమరకుల్ తండ్రి పేరు రాజేందర్. తల్లి పేరు కుల్విందర్. కూతురి పేరులో తమ పేర్లు కలవాలని ఆలోచించారు. పూర్తి పేర్లను కలిపితే బాగుండదని భావించిన వారు తొలి అక్షరాలను కలిపి రకుల్ (RA + Kul ) అని పేరు పెట్టారు.

కరాటేలో బ్లూ బెల్ట్ ఫిట్ బ్యూటీ చిన్నప్పుడే టెన్నిస్, గోల్ఫ్ ఆటల్లో అనేక బహుమతులు గెలుచుకుంది. రెండో తరగతి నుంచే రకుల్ కరాటే నేర్చుకోవడం ప్రారంభించింది. కొంతకాలానికే బ్లూ బెల్ట్ సొంతం చేసుకుంది.

హార్స్ రైడర్ రకుల్ తల్లిదండ్రులు ఆమెను ఓ వైపు చక్కగా చదివిస్తూనే, మరో వైపు ఆమె ఇష్టాలని గౌరవించారు. హార్స్ రైడింగ్ నేర్చుకుంటానంటే దగ్గరుండి నేర్పించారు. ఇప్పుడు కూడా రకుల్ సూపర్ గా గుర్రపు స్వారీ చేయగలదు.

టీవీకి దూరం చాలామంది చిన్నప్పుడు టీవీలను చూసే సినిమాల్లోకి వెళ్లాలని కలలు కంటారు. రకుల్ మాత్రం బాల్యంలో టీవీకి దూరమయింది. టీవీ ముందు కూర్చుంటే కుమార్తెలో ప్రతిభ బయటికి రాదని తండ్రి రాజేందర్ హోమ్ వర్క్ అయిన తర్వాత మిగతా ఆటల్లో ప్రోత్సహించేవారు.

ప్రేమ వివాహమే రకుల్ తన పెళ్లి విషయంలో క్లారిటీగా ఉంది. తనకి 30 ఏళ్లు నిండక ముందే ఇల్లాలిగా కావాలని ఆశపడుతోంది. అంతేకాదు తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ధైర్యంగా చెప్పింది. మరో విషయం తన జీవితంలో రాబోయే వ్యక్తి తనకంటే పొడవుగా ఉండాలంట.

షారూక్ వీరాభిమాని అందరి అమ్మాయిల మాదిరిగానే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కి రకుల్ వీరాభిమాని. అతని చిత్రాలను చూసే పెరిగింది. రీసెంట్ గా రకుల్ బాలీవుడ్ మూవీ సిమ్లా మిర్చిలో నటిస్తుంటే.. అక్కడికి షారుఖ్ ఖాన్ వచ్చారు. అతన్ని చూసిన రకుల్ తాను హీరోయిన్ అన్న సంగతి పక్కన పెట్టి షారుక్ తో ఫోటో దిగేందుకు అభిమానిగా పరిగెత్తింది.

టూత్ పేస్ట్ ప్రకటనముంబై మోడల్స్ ఎక్కువగా సౌందర్య ఉత్పత్తులను ప్రమోట్ చేసి హీరోయిన్ ఛాన్స్ కొట్టేస్తుంటారు. రకుల్ మాత్రం స్టడీ పూర్తి అయిన తర్వాత విక్కో వజ్రదంతి టూత్ పేస్ట్ లో నటించింది. ఆమె ఈ యాడ్ లో కనిపించిన తర్వాత ఈ ఉత్పత్తి విక్రయాలు భారీగా పెరిగాయి.

నాట్యకారిణిరకుల్ ఎక్కువగా జిమ్ లోనే గడుపుతుంటుంది అని అంటుంటారు. తనలోని ఫ్యాట్ ని కరిగించుకోవడానికి ఆమె వ్యాయామం మాత్రమే కాదు భరత నాట్యం చేస్తుంది. కొన్నేళ్లు ట్రైనింగ్ కూడా తీసుకుంది. ఇప్పుడు సమయం చిక్కినప్పుడల్లా స్వేదం చిందేలా నాట్య సాధన చేస్తుంది.

చలికాలం అంటే మంట శీతాకాలం అంటే అందరికి ఇష్టం. రకుల్ కి మాత్రం మంట. అన్ని కాలాల్లో వింటర్ అంటే అసహ్యించుకుంటుంది. కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత పాటల కోసం కొండ ప్రాంతాలకు వెళ్లి చలిలో డ్యాన్సులు చేయడం అలవాటు చేసుకుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus